Ravi Teja : `క్రాక్` సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన మాస్ మహా రాజ్ రవితేజ(mass maharaja ravi teja).. మళ్లీ వరుస‌ ఫ్లాపుల్లో మునిగిపోయిన సంగతి తెలిసింది ఈయన నుంచి చివరగా వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ప్రస్తుతం ఈయన ధమాకా మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. నక్కిన‌ త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

ప్రముఖ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ‌, స్క్రీన్ ప్లే అందించ‌గా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్(TG vishwa prasad), అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లో విడుదల కానుంది. ఇప్పటికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజర్, సాంగ్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ప్ర‌స్తుతం మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మ‌రింత హైప్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ర‌వితేజ ట్విట్ట‌ర్ ద్వారా `ఆస్క్ ర‌వితేజ‌(AskRaviteja)` పేరుతో చిట్ చాట్ సెష‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చారు.

ధ‌మాకా మూవీపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? అని ప్ర‌శ్నించ‌గా.. వంత శాతం అని స‌మాధానం ఇచ్చాడు. ధ‌మాకా అవుట్ పుల్ ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించ‌గా.. అదిరిపోయింద‌ని ర‌వితేజ తెలిపారు. అలాగే ఓ నెటిజన్ శ్రీ‌లీల(sreeleela) గురించి చెప్ప‌డ‌ని కోర‌గా ర‌వితేజ ఊమించ‌ని కామెంట్స్ చేశాడు. శ్రీ‌లీల‌లో చాలా ట్యాలెంట్ ఉంద‌ని.. ఆమె ఒక `బండిల్ ఆఫ్ టాలెంట్` అని ర‌వితేజ పేర్కొన్నారు. ఇక అభిమానులు త‌న కుటుంబం అని.. ఈ సారి హిట్ మిస్ అయ్యే ప్ర‌స‌క్తే లేద‌ని కూడా ర‌వితేజ తెలిపారు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *