Rashmika Mandanna opens up about drawing a line with her parents: 'Don't try to control my life because…' | Entertainment News,The Indian ExpressRashmika.. టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక (Rashmika) స్టార్ హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు. తెలుగులో మాత్రం మొదట ఛలో సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టింది. అటు తర్వాత మంచి కథలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కన్నడలో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈమె అందం గురించి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుచేతనే రష్మికాను నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచీ వచ్చి టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా తన అడుగులు వేస్తోంది రష్మిక.

అయితే రష్మిక హీరోయిన్గా ఎదిగిన తర్వాత కాస్త గర్వము, అహంకారం ఎక్కువైందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది రష్మిక. కన్నడ ప్రేక్షకులు కొందరు ఆమెపై అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంతారా సినిమా విషయంలో రష్మికను ఎక్కువగా ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రోల్స్ తో ఇతర వివాదాలపై రష్మిక తాజాగా స్పందించడం జరిగింది. కాంతారా సినిమా విడుదలైన కొత్తలో రష్మిక ను కాంతారా చిత్రం చూశారా అని ఒక ఇంటర్వ్యూలో అడగగా.. తాను చూడలేదని సమాధానాన్ని తెలియజేసింది. ఆ విషయం చాలా వైరల్ గా మారింది.

దీంతో కొంతమంది కన్నడ ప్రేక్షకులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరొక ఇంటర్వ్యూలో తన సినీ జర్నీ గురించి వెల్లడిస్తూ తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరును ప్రస్తావించకుండా సోకాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అన్నట్టుగా రష్మిక తెలియజేసిందనే వార్తలు వినిపించాయి. దీంతో ఈ విషయాలపై రష్మిక ను తన సొంత కన్నడ అభిమానులే ట్రోల్ చేయడం జరిగింది. కాంతారా హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) ఆమధ్య రష్మిక గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇదే సమయంలో రష్మిక కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి.

హైదరాబాదులో రష్మిక మీడియాతో మాట్లాడుతూ.. కాంతారా విడుదలైన రెండు మూడు రోజులలో నన్ను చూశారు అని అడిగారు. అప్పటికి నేను చూడలేదు ఇప్పుడు నేను చూసి టీమ్ కి మెసేజ్ కూడా పెట్టాను.. అందరూ కూడా థాంక్యూ అని రిప్లై కూడా ఇచ్చారు. బయట అలా ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని , తన జీవితంలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియదు.. లోపల ఏం జరుగుతుందో ఆ దేవుడుకి మాత్రమే తెలుసు అని తెలియజేస్తోంది. తనకు వచ్చిన ప్రతి మెసేజ్ ను సోషల్ మీడియాలో పెట్టలేను. నా వ్యక్తిగత జీవితం గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అవసరం లేదని తెలియజేసింది. తనని ఏ ఇండస్ట్రీలో కూడా ఎవరు బ్యాన్ చేయలేదని తెలియజేసింది రష్మిక. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా సీక్వెల్లో నటిస్తోంది.

Click Here And Follow PakkaFilmy On Google News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *