Ram Gopal Varma

Ram Gopal Varma : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1990లోనే శివ (Shiva) లాంటి పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన అప్పట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అమితా బచ్చన్ (Amitabh Bachchan) లాంటి బడా హీరోతో సర్కార్ వంటి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఉంటున్న చాలామంది డైరెక్టర్లకు ఈయన ఓ గురువు లాంటివారు. అయితే అప్పట్లో అన్ని అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈమధ్య కాలంలో చాలా వివాదాల్లో చిక్కుతూ వివాదాల డైరెక్టర్ గా మారిపోయారు.

చాలామంది స్టార్ సెలబ్రిటీల మీద ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం నెట్టింట్లో వైరల్ గా మారుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఆయన యంగ్ హీరోయిన్లతో చేసే రొమాన్స్ చాలా వైరల్ అవుతుంది.ఇక తాజాగా ఆయన తీసిన డేంజరస్ (Dangerous) సినిమా ఈరోజు విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాంగోపాల్ వర్మ ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయన చాలా మంది స్టార్ హీరోల మీద షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాంగోపాల్ వర్మ ని చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రశ్నిస్తూ ఒకవేళ చిరంజీవి సినిమాల్లోకి రాకుండా ఉంటే ఇంకా వేరే ఎందులో సక్సెస్ అయ్యే వారని మీ అభిప్రాయం అంటూ యాంకర్ ప్రశ్నించగా దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు రాంగోపాల్ వర్మ. రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా ఇండస్ట్రీ లోకి కాకుండా ఇంక వేరే ఏ ఇతర రంగంలోకి వెళ్లినా కూడా ఆయన అంతగా సక్సెస్ అయ్యే వారు కాదు. కేవలం ఆయనకు ఉన్న మెంటాలిటీకి సినిమా ఇండస్ట్రీ అయితేనే సెట్ అవుతుంది. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ కాకుండా వేరే ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా ఆయన అందులో సక్సెస్ అయ్యే వారు కాదు బిగ్ ఫెయిల్యూర్ పర్సన్ గా నిలిచిపోయేవారని చిరంజీవి మీద నా ఫీలింగ్ అంటూ రాంగోపాల్ వర్మ సంచలనం వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం రాంగోపాల్ వర్మ చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ విషయంలో చిరంజీవి ఎలా బదులిస్తారో వేచి చూడాలి. అప్పట్లో సంచలన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ని చూసి ఆయన అభిమానులు ఇలా మారిపోయాడు ఏంటి అని కొంతమంది బాధపడుతుంటే, మరి కొంతమందేమో రాంగోపాల్ వర్మ చేసేదే కరెక్ట్. ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నారు. ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *