Panchathantram ReviewPanchathantram Review :

నటీనటులు : బ్రహ్మానంద, శివాత్మిక రాజశేఖర్, స్వాతి, సముద్ర ఖని, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద తదితరులు
దర్శకుడు : హర్ష పులిపాక
నిర్మాతలు : అఖిలేష్ వర్ధన్, సృజన్
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్ , ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ : రాజ్ కె నల్లి
ఎడిటర్ : గ్యారీ బీ హెచ్

Click Here For Follow PakkaFilmy On Google News

తెలుగు లో అంథాలజీ సినిమాలు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. మొన్నటిదాకా ఇవి ఎక్కువగా వెబ్ సిరీస్ లో ఉండేవి. అలా ఇప్పుడు ఐదు కథలను ఒకే సినిమాలో ఇమిడించే ప్రయత్నం చేశాడు దర్శకుడు హర్ష పులిపాక. అయన దర్శకత్వం వహించిన తాజాగా సినిమా పంచతంత్రం (Panchathantram). ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఈ సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

ఐదు కథల సమాహారమే ఈ పంచతంత్రం. వేదవ్యాస్ (బ్రహ్మానందం)(Brahmanandam) ఆలిండియా రేడియో లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. ఖాళీగా ఉండడం ఇష్టం లేక స్టాండప్ స్టోరీ టెల్లర్ గా కెరీర్ ను మొదలుపెట్టాలని భావిస్తాడు. వయసైపోయాక కెరీర్ కోసం పాకులాడడం ఏంటని ఆయనను అర్థం చేసుకోకుండా రోషిని (కలర్స్ స్వాతి)(Colours Swathi) నానామాటలు అంటుంది. అయితే కూతురిని పట్టించుకోకుండా స్టోరీ టెల్లర్ పోటీలకు వెళతాడు. అక్కడ పంచేంద్రియాల కాన్సెప్ట్ తో ఐదు కథలు చెబుతాడు. ఈ కథల్లో చివరిలో వచ్చే మలుపులు ఏవిధంగా ఉంటాయి. ఈ పోటీల్లో వేదవ్యాస్ గెలుస్తాడా అనేదే అసలు కథ.

నటీనటులు :

హాస్యనటుడిగా ఇన్ని రోజులు నవ్వుల పువ్వులు పూయించిన బ్రహ్మానందం మంచి ఎమోషనల్ నటుడు అన్న విషయం ఎన్నో సినిమాల ద్వారా తెలిసింది. అందరిని నవ్వించిన ఆయన చాలా సార్లు ఎమోషనల్ అయ్యేలా నటించారు కూడా. అలాంటి వేదవ్యాస్ పాత్ర లో ఎంతో అద్భుతంగా నటించారు బ్రహ్మానందం. స్వాతి రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో సాగుతుంది. చాలా రోజుల తర్వాత ఆమె ఓ మంచి పాత్ర పోషించారు. ఐదు కథల్లో ఒక కథ లో నటించిన రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాత్మిక (Shivathmika) ఇద్దరు మంచి పాత్రల్లో కనిపించారు. ఈ పాత్ర లు సినిమా కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సినిమాలో ఇతర పాత్రలు పోషించిన దివ్య శ్రీ పాద (Divya Sripada), వికాస్ (Vikas), సముద్ర ఖని (Samudra Khani) , దివ్య వాణి (Divyavani) , ఉత్తేజ్ నటన ఆకట్టుకుంది.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు హర్ష మనసును హత్తుకునే ఒక మంచి కథను రాశారని చెప్పాలి. పొయెటిక్ సెన్స్ లో తీసిన ఈ సినిమా క్లాస్ ఆడియెన్స్ ను ఎంతో మెప్పిస్తుంది. సినిమాలో అన్ని అంశాలు నిత్యం మనం ఎక్కడో చోట చూసినవే. ముందుగా అయన ఐడియా కి శభాష్ అనాలి. పంచేంద్రియాల కాన్సెప్ట్ కు అందరు ముగ్దులవుతున్నారు. టేకింగ్ కూడా ఎంతో బాగుంది. ఈ సినిమా కి సంగీతం హాలైట్ అని చెప్పాలి. మంచి పాటలు, కథ కు తగ్గ నేపథ్య సంగీతం బాగుంది. కెమెరా విజువల్స్ బాగున్నాయి. ఎంతో నేచురల్ గా ఉండేలా కెమెరా వర్క్ చేశారు. నిర్మాతలు అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో వచ్చే కథలు

ఎమోషన్ సీన్స్

పాత్రల ఎంపిక

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు

తీర్పు : ఫీల్ గుడ్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఎంతో నచ్చుతుంది. తెలుగు లో ఇలాంటి ఓ ఎమోషన్ టచ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. తప్పకుండ ఈ సినిమా ప్రతిఒక్కరికి నచ్చుతుంది.

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *