Hansika Motwani

Hansika Motwani: సినిమా ఇండస్ట్రీలో తొలిచూపులోనే ప్రేమలో పడి కొన్ని రోజులు తిరిగి ఆ తర్వాత అభిప్రాయాలు కుదరక బ్రేకప్ అంటూ విడిపోతారు. ఇప్పటికే ఇలా ఎన్నో జంటలు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు వచ్చాక కూడా బ్రేకప్ అంటూ విడిపోయారు. ఇక మరికొంతమంది సెలబ్రిటీలేమో పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు పుట్టి సంవత్సరాలు గడిచినా కూడా చిన్న చిన్న కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఇంకొంతమందేమో ఎలాంటి అభిప్రాయాలు కలవకుండానే కేవలం ఒక అట్రాక్షన్ లో పడి పెళ్లిళ్లు చేసుకొని పెళ్లయిన సంవత్సరంలోపే విడాకుల బాట పడుతున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా హన్సిక మోత్వాని తన ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కిన విషయం మనకు తెలిసిందే. అయితే హన్సిక పెళ్లికి వస్తానంటే ఓ స్టార్ హీరో భార్య మాత్రం చచ్చిపోతానని బెదిరించిందట. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. హన్సిక దేశముదురు (Deshamuduru)సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఇక మొదటి సినిమాతో మంచి గుర్తింపు రావడంతో వరుసగా కొన్ని సినిమాల్లో నటించింది. ఇక అలాంటి టైం లోనే ఓ తెలుగు హీరోతో ప్రేమలో పడి హద్దులు దాటింది. ఇక ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది.

ఇక ఆ హీరో మాత్రం తెలుగులోనే సినిమాలు చేసేవాడు. ఇక కోలీవుడ్ కి హన్సిక వెళ్లాక అక్కడ శింబు (Shimbu) తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అంతేగాక ఈ తెలుగు హీరోతో హన్సికకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే దాన్ని రిజెక్ట్ చేసింది. దాంతో ఆ హీరో కూడా ఆమెను వదిలేసి పెళ్లి చేసుకున్నాడు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే.. తెలుగు హీరోలలో హన్సిక తన పెళ్లికి ఎవరిని ఆహ్వానించలేదు. కానీ ఒక్క తన మాజీ ప్రియుడిని మాత్రం ఆహ్వానించింది. ఇక తాను కూడా ఆమె పెళ్లి చేసుకోబోతుంది కదా ఎందుకు పంతం అని పెళ్లికి రెడీ అయ్యారట.

కానీ ఆ హీరో భార్యకి వీళ్ళిద్దరి ప్రేమ విషయం ముందే తెలుసు. దాంతో నువ్వు ఇప్పుడు ఆమె పెళ్లికి పోతే నేను నీ ముందే కత్తితో పొడుచుకుంటా అంటూ భయపెట్టిందట. ఇక ఏం చేయాలో తెలియక ఆ హీరో పెళ్లికి వెళ్ళక సైలెంట్ గా ఉండిపోయారట. ఇలా హన్సిక (Hansika Motwani) పెళ్లికి వెళ్తాను అనుకున్న ఆ తెలుగు హీరోకి భార్య ద్వారా పెద్ద షాక్ తగిలింది అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఎప్పటికీ ఆ హీరోయిన్ మొహం చూడకూడదు అంటూ ఆ తెలుగు హీరో భార్య మాట కూడా తీసుకుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *