Hansika Motwani :`దేశముదురు` చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన యాప‌ల్ బ్యూటీ హన్సిక మోట్వాని.. త‌న‌దైన టాలెంట్ తో అంచ‌లంచ‌లుగా ఎదురుగుతూ స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. తెలుగులోనే కాకుండా త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఆదివారం(డిసెంబ‌ర్ 4) పెళ్లి బంధంతో కొత్త జీవితం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహైల్ కథూరియాను హ‌న్సిక వివాహం చేసుకుంది. రాజస్థాన్‌ జైపూర్‌లోని ముందోట‌ ఫోర్ట్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. కుటుంబ స‌భ్యులతో పాటు అత్యంత స్నేహితులు, సన్నిహితులు మాత్ర‌మే హన్సిక పెళ్లికి హాజ‌రు అయ్యారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి హల్దీ, సంగీత్, మెహందీ వంటి కార్య‌క్ర‌మాల‌ను ఘ‌నంగా నిర్మించారు.

ఇప్ప‌టికే హ‌న్సిక‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్ప‌టికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కొత్త పెళ్లి కూతురు హ‌న్సిక వివాహం అనంత‌రం తొలిసారి గ‌రిటె ప‌ట్టింది. అత్తారింట్లో భ‌ర్త సోహైల్ కోసం ఎంతో ప్రేమ‌గా పెహ్లీ రసోయ్‌ (హల్వా)ని తయారు చేసింది. ఈ విషయాన్ని తన భర్త సోహెల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను సైతం పోస్టు చేశాడు. ఈ పిక్ లో హ‌న్సిక తాను వండిన పెహ్లీ రసోయ్ ను స‌ర్క్ చేస్తూ క‌నిపించింది. కాగా, హ‌న్సిక‌కు ఇది మొద‌టి వివాహం కాగా సోహైల్‌ కు మాత్రం ఇది రెండోది. గ‌తంలో హ‌న్సిక స్నేహితులు రింకీ బ‌జాజ్‌ను సోహైల్ పెళ్లి చేసుకున్నాడు. ప‌లు మ‌న‌స్ఫ‌ర్థ‌లు త‌లెత్త‌డంతో వీరి ఎక్కువ కాలం క‌లిసి ఉండ‌లేక‌పోయారు. రింకా బ‌జాజ్‌ నుంచి సొహైల్ విడాకులు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత సోహైల్, హ‌న్సిక ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. ఇరుకుటుంబ‌స‌భ్యులు వీరి ప్రేమ‌కు అంగీరం తెల‌ప‌డంతో.. మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు.

https://www.instagram.com/p/Cl6IiqzvOcB/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *