Gurthunda Seethakalam ReviewGurthunda Seethakalam Review & Rating :

మూవీ : గుర్తుందా శీతాకాలం
నటీనటులు : సత్యదేవ్, తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యా శెట్టి, సుహాసిని తదితరులు
సంగీతం : కాల భైర‌వ‌
ద‌ర్శ‌కుడు: నాగ శేఖ‌ర్
నిర్మాత‌లు: నాగశేఖర్, రామారావు, భావన రవి
విడుదల తేదీ : 09 డిసెంబర్ 2022

Click Here For Follow PakkaFilmy On Google News

టాలీవుడ్ వర్సటైల్ హీరో సత్యదేవ్ హీరో గా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. ఫీల్ గుడ్ మూవీ తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ప్రమోషన్ కార్యక్రమాలలో తమదైన కొత్తదనాన్ని ప్రదర్శించిన ఈ సినిమా ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాగా పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పుడు విడుదల అవడం విశేషం. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ :

మధ్య తరగతి యువకుడైన దేవ్ (సత్యదేవ్) బాల్యంలోనే ప్రేమలో పడి విఫలం అవుతాడు. ఆ బాధలో ఉండగానే కాలేజీ లో అమృత (కావ్య శెట్టి) అనే ఓ రిచ్ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఉద్యోగం కోసం బెంగుళూర్ లో ఉద్యోగం చేస్తుండగా చాలీచాలని డబ్బుతో అతనితో బ్రతకడం కష్టం అని అమృత తల్లి చెప్పడంతో బ్రేకప్ చెబుతుంది. అప్పుడే దేవ్ జీవితంలోకి నిధి (తమన్నా) ప్రవేశిస్తుంది. దేవ్ గతం తెలుసుకున్నాక అతన్ని నిజాయితీగా లవ్ చేస్తుంది. ఈ ఇద్దరు పెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో మళ్ళీ అమృత దేవ్ కి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తుంది. మరి వీరి పెళ్లి జరుగుతుందా.. అమృత ఎందుకు తిగిగి దేవ్ కి దగ్గరవ్వాలనుకుంటుంది అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు :

దేవ్ పాత్రలో సత్యదేవ్ ఎంతో బాగా ఒదిగిపోయాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్ర లో సత్యదేవ్ మంచి ప్రతిభ కనపరిచాడు. గాడ్ ఫాదర్ సినిమా లో విలన్ గా కనిపించిన సత్యదేవ్, ఈ సినిమా లో లవర్ బాయ్ గా కనిపించి మరోసారి తన నటనా కౌశల్యాన్ని చూపించాడు. హీరోయిన్ లు గా నటించిన మేఘా ఆకాష్, కావ్య శ్రీ, తమన్నా తమ అందం తో ఆకట్టుకున్నారు. నటీమణులుగా వీరు ఎలా నటిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తమన్నా కొన్ని సీన్స్ లో సత్యదేవ్ ను డామినేట్ చేసింది. తన లుక్స్ తో అందరిని మెస్మరైజ్ చేసింది. ఇక ప్రియదర్శి తన కామెడీ తో అందరిని నవ్వించాడు. కాలేజీ ఎపిసోడ్ లో కామెడీ బాగా పండించారు. మిగితా నటీనటులు తమ పాత్ర మేరకు పర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు ఈ కథను రూపొందించడంలో కొంతైనా కొత్త దనాన్నినింపితే బాగుండేది. అదే పాత కథ తో సినిమా చేశాడు. ఎక్కడ కొత్త దనం కనపడలేదు. ఇందులో మొత్తం మూడు ప్రేమకథలున్నాయి. ఏ ఒక్కటి కూడా ఫ్రెష్ గా అనిపించలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ పర్వాలేదు. కామెడీ ని బాగానే పండించగలిగాడు కానీ సినిమాలో లవ్ ఎమోషన్ మిస్ అయ్యింది. క్లైమాక్స్ కూడా బాగుంది. ఈ రెండు తప్పితే సినిమా చూడదగ్గ అంశాలే లేవు. గతంలో ఇలాంటి సినిమాలు చూసిన ఫీలింగ్స్ కలుగుతాయి. పాటలు పేలవంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా పెద్దగా ఆకట్టుకోదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. మిగితా టెక్నిషన్స్ అందరు తమ పరిధి మేరకు బాగానే పనిచేశారు.

ప్లస్ పాయింట్స్ :

తమన్నా

కామెడీ

అక్కడక్కడా కొన్ని ట్విస్ట్ లు

మైనస్ పాయింట్స్ :

కథ

సంగీతం

బాగా ఉన్న సినిమాలకే ప్రేక్షకులు వెళ్లాలంటే ఆలోచిస్తున్న రోజులు. అలాంటి టైం లో ఏమాత్రం కొత్త దనం లేని కథ తో వస్తే ఆ సినిమా కు ఎవరు వెళ్ళరు. అక్కడక్కడా విస్మయపరిచే విషయాలు తప్పా సినిమాలో పెద్దగా దమ్ము లేదు. లవ్ స్టోరీ లు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. తమన్నా అభిమానులకు కూడా..

రేటింగ్ : 2/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *