Brahmanandam : కామెడీ కింగ్ బ్రహ్మానందం(Brahmanandam) గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో 1200 కు పైగా చిత్రాల్లో న‌టించారు. విలక్షణ పాత్రల్లో విభిన్నమైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్ష‌కుల‌కు చక్కటి వినోదాన్ని పంచారు. క‌మెడియ‌న్ గా సుధీర్గ కాలం పాటు విశిష్టమైన సేవలు అందిస్తూ ఎన్నో రికార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడీయ‌న‌.

అత్తిలిలో లెక్చరర్‌గా ప‌ని చేసే ఈయ‌న.. `ఆహా నా పెళ్లంట(aha na pellanta)` చిత్రంతో సినీ రంగ‌ప్ర‌వేశం చేశారు. మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న బ్రహ్మానందం.. రెండు, మూడు తార‌ల హీరోల సినిమాల్లోనూ న‌టించి రికార్డ్ క్రియేట్ చేశారు. బ్రహ్మానందం కామెడీ వ‌ల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

అయితే బ్ర‌హ్మానందం హీరోగా కూడా ఓ సినిమా చేశాడు. నేటి తారం ప్రేక్ష‌కుల్లో చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఈ విష‌యం తెలుసు. ఇంత‌కీ బ్రహ్మానందం హీరోగా న‌టించిన ఒకే ఒక్క సినిమా మ‌రెంటో కాదు.. `బాబాయ్ హోటల్(babai hotel)`. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యాన‌ర్ పై కె.ఎస్.రామారావు నిర్మించారు. ఇందులో మధుశ్రీ బ్రహ్మానందంకు జోడీగా న‌టించింది. మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు. అనాథ పిల్లలను చేరదీసి కాపాడే ఒక వ్యక్తి కథే బాబాయ్ హోట‌ల్‌.

హోటల్ నడిపే రామ చంద్ర మూర్తి(Brahmanandam) పాత్ర‌లో బ్ర‌హ్మానందం న‌టించాడు. పేరుకి తగ్గట్టే అందరితో మంచిగా ఉంటూ అనాథ పిల్లలను చేరదీసి పెంచే రామ చంద్ర కొన్ని క‌ష్టాలు ఎదుర్కొంటాడు. 1992లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. బ్రహ్మానందం హీరో అన‌గానే ఈ సినిమాపై అప్ప‌ట్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ, కామెడీ కంటే బరువైన ఎమోషన్లు ఎక్కువైపోవడం, క్లైమాక్స్ విషాదాంతంగా ముగియడం సినిమాకు పెద్ద మైన‌స్ లుగా మారాయి. అయితే బ‌హ్మానందం మాత్రం కామెడీతో పాటు సెంటిమెంట్ సీన్లలో కూడా అద్భుతంగా న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *