Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈయన ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. వచ్చిన తర్వాత అవమానాలు కూడా ఎదుర్కొని.. చివరికి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. నాడు ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన నేడు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా మారాడు. ఇదిలా ఉండగా ఒక స్టార్ హీరోయిన్ వల్ల బ్లాక్ బస్టర్ సినిమాలనే కోల్పోయారు చిరంజీవి. అంతేకాదు ఆమె వల్ల తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను కూడా చవిచూశాడు. ఆమె ఎవరో.. ఎందుకో.. ఇప్పుడు చూద్దాం.

బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగపెట్టి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా ఏలిన ఏకైక స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవి ఎంతో మంది హీరోలను స్టార్ హీరోలుగా మార్చింది. అంతేకాదు దర్శకులు, నిర్మాతలు కూడా ఎదిగారు. కానీ టాలీవుడ్ లో స్టార్ హీరో చిరంజీవి మాత్రం శ్రీదేవి వల్ల నష్ట పోయారని చాలామందికి తెలియదు. చిరంజీవి టాలీవుడ్ లో ఎదుగుతున్న సమయంలోనే శ్రీదేవి కూడా అదే స్థాయిలో సంపాదించుకుంది.

ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఆ సినిమా సూపర్ హిట్ అన్న రేంజ్ కు శ్రీదేవి ఎదిగింది దాంతో నిర్మాతలు శ్రీదేవి ఇంటి ముందు కూడా క్యూ కట్టే పరిస్థితి ఏర్పడింది.
ఆ సమయంలో చిరంజీవి(Chiranjeevi), శ్రీదేవితో సినిమా చేయాలని పలువురు దర్శకులు భావించారు. కానీ శ్రీదేవి మాత్రం చిరంజీవితో నటించడానికి ఎన్నో అభ్యంతరాలు పెట్టేది. కొన్నిసార్లు సినిమా ఒప్పుకొని కూడా ఆ తరువాత కారణాలు చెప్పి తప్పుకుందట. అలా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ సినిమా కథా రెడీ అయింది.

ఈ చిత్రానికి శ్రీదేవి (Sreedevi) నే నిర్మాత కావడం విశేషం. త్వరలోనే పట్టాలెక్క పోతోంది అన్న సమయంలో శ్రీదేవి ఒక షరతు పెట్టిందట. ఈ చిత్రానికి తాను నిర్మాత కాబట్టి తన పాత్ర చిరంజీవి కంటే హైలైట్ గా ఉండాలని చెప్పిందట. దాంతో ఒప్పుకోని దర్శకుడు సినిమాను ఆపేశారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రావాల్సిన కొండవీటి రాజా సినిమా కూడా ఆగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *