Bigg Boss Telugu 6: Arohi and Adi argue; Rohit, Marina and 7 others  nominated for eviction | PINKVILLABigboss6.. బిగ్ బాస్ (Bigboss)ఆరవ సీజన్ 14వ వారం ఆదివారంతో పూర్తవుతుంది. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం బాగా వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే విన్నర్ మెటీరియల్ రోహిత్ అంటూ పేరు కూడా వినిపిస్తుంది. గత రెండు వారాలుగా రోహిత్ (Rohith) రెండవ స్థానానికి చేరుకోవడంతో తన ఆట తీరుకు ఆడియన్స్ కూడా మద్దతు ఇస్తున్నారు. టైటిల్ రేసులో టాప్ 2 లో నిలుస్తున్నాడు రోహిత్. ముందు నుంచి సైలెంట్ గా ఉంటూ.. తన పని తాను చేసుకుంటూ.. అమ్మాయిల నిర్ణయాలను గౌరవిస్తూ.. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. అనవసర గొడవలకు వెళ్లకుండా.. ఆట.. మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేవంత్ (Revanth)అని అంతా అనుకుంటున్న సమయంలో ఇప్పుడిప్పుడే విన్నర్ మెటీరియల్ రోహిత్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు వారాల నుంచి రోహిత్ రెండవ స్థానానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ ముగింపు వచ్చే సమయంలో రోహిత్ కు షాక్ కి తగిలింది. రోహిత్ ఇన్ స్టా డిజైబుల్ అయింది. అతని అకౌంట్ మొత్తం హ్యాక్ అయింది. అతని ఖాతాలో ఎటువంటి అప్డేట్స్ కనిపించడం లేదు అయితే పాత ఫొటోస్, వీడియోస్ కూడా కనిపించడం లేదు. దీంతో రోహిత్ కు ఓటు వేయాలనుకునే అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అయితే ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ రోహిత్ భార్య మెరీనా (Marina) తన ఇన్స్టా లో వీడియో షేర్ చేసింది. ఇది చాలా సాడ్ న్యూస్.. రోహిత్ ఇన్స్టా అకౌంటు హ్యాక్ అయింది.. ఎందుకు ఇలా అయింది? ఎవరు చేశారన్నది? అర్థం కాలేదు. కానీ మేము కంప్లైంట్ చేశాము. 24 గంటల్లో ఆక్టివేట్ అవుతుందని చెబుతున్నారు. అప్పటివరకు నా ఇన్స్టా అకౌంట్లో రోహిత్ అప్డేట్స్ పెడుతూ ఉంటాను. ఆ అకౌంట్ ని మీరు ఫాలో అవ్వండి . దయచేసి రోహిత్ కు ఓటు వేయడం ఆపొద్దు ..

ఎందుకంటే మీరు వేసే ప్రతి ఓటు అతడికి చాలా విలువైనది. రోహిత్ కు సపోర్ట్ చేయండి అంటూ వీడియో రూపంలో చెప్పుకొచ్చింది మెరీనా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

 

View this post on Instagram

 

A post shared by Marina Abraham Sahni (@marina.a1203)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *