Biggboss6 : బిగ్ బాస్ (Biggboss6) సీజన్ 6 ఇంకో రెండు వారాలు అయితే పూర్తవుతుంది. ఈ సీజన్ ని చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కానీ ఈ సీజన్ చూడడానికి చాలామంది బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. ఇక బిగ్ బాస్ సీజన్లలో మొదటి సీజన్లో jr.ఎన్టీఆర్ (Jr.Ntr), రెండో సీజన్ లో హీరో నాని (Nani)హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుండి ఇప్పటివరకు నాగార్జున వరుసగా హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. నాగార్జున వీకెండ్స్ వస్తూ వాళ్ళు చేసే తప్పులను ఎత్తిచూపుతూ మంచి పనులను ప్రోత్సహిస్తూ ఓవైపు సినిమాలను,మరోవైపు ఈ షోను రెండింటిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు.

నాగార్జున (Nagarjuna) ఆరుపదుల వయసు దాటినా కూడా ఓ యంగ్ హీరో లాగా ఇప్పటికీ తన డ్రెస్సింగ్ స్టైల్ మైంటైన్ చేస్తూ చూసే వాళ్లందర్నీ ఆశ్చర్యపరుస్తారు. అలాగే యంగ్ హీరోలు చేసే సినిమాలను నాగార్జున చేస్తూ ఈయనకు ఇలా ఎలా సాధ్యం అయిందబ్బా అని అందరూ మాట్లాడుకునేలా ఆయన తన పర్ఫామెన్స్ చూపిస్తారు. ఇక ఈ మధ్యనే ఈయన హీరోగా వచ్చిన ది గోస్ట్ (Theghost) సినిమా అంతగా ఆకట్టు కోలేక పోయింది. ఇక ఈయన వయసుతో సంబంధం లేకుండా తన కొడుకుల్లాగే లాగే చాలా గ్లామర్ గా కనిపిస్తారు. ఇక వారం వారం వీకెండ్ కి వచ్చి హౌస్ లోని కంటెస్టెంట్లను మాత్రమే కాకుండా బిగ్ బాస్ చూసే ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తారు.

ఇక శనివారం, ఆదివారం ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే చాలామంది ఏంటబ్బా ఇలా తయారవుతున్నాడు రోజురోజుకి అంటూ భావిస్తారు. ఎక్కువగా రంగురంగుల పూల చొక్కాలు వేసుకుంటూ చూసే వాళ్ళని మెస్మరాజ్ చేస్తాడు. అయితే సెలబ్రిటీలు అంటే లక్షల్లో వారి బట్టల ఖర్చు ఉంటుందని మనకు ఇప్పటికే తెలుసు. ఇక నాగార్జున(Nagarjuna) విషయంలో ఆ డ్రెస్సుల ఖర్చు ఎన్ని లక్షల్లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ నాగార్జున అలా పూల పూల డ్రస్సులు వేసుకొని రావడం వల్ల కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నాగార్జున డ్రెస్సింగ్ స్టైల్ పై కామెంట్లు చేస్తున్నారు.

ఆయన వేసుకునే షర్ట్స్ ధర లక్షలు ఉంటాయని మనకు తెలుసు.కానీ ఆ డ్రెస్సులు చూడడానికి చార్మినార్ (Charminar)దగ్గర, కోఠి లో కొన్నట్లు ఉన్నాయి. 100 రూపాయలకు కొన్నారా అంటూ కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆయన ప్రతి వీకెండ్ కి వేసుకుని షర్ట్స్ ధర లక్ష రూపాయలకు పై మాటే ఉంటుంది. కానీ చూడడానికి ఆ డ్రెస్సులు కోఠి లో కొన్నట్లు ఉన్నాయంటూ చాలామంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *