Biggboss6

Biggboss6: బుల్లితెర మీద ఇప్పటికే ఎన్నో షోలు అలరిస్తున్నాయి. అందులో రియాల్టీ షోగా స్టార్ మా లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతోమంది ఈ షోకి వెళ్లి చాలా పాపులర్ అయ్యారు. ఇక ఈ నేపద్యంలోనే ఇందులోకి చాలామంది కనుమరుగైన నటీనటులు, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళు, సీరియల్ నటి నటులు, కమెడియన్స్, సింగర్స్, డాన్సర్స్, కొరియోగ్రాఫర్స్ ఇలా ఎంతోమంది ఈ షో కి వెళ్లి చాలా పాపులర్ అయ్యారు.

ఇక ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ (Biggboss) ఇంకొక వారం రోజులు గడిస్తే ఈ సీజన్ 6 కూడా పూర్తవుతుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 5 లో వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయిన సిరి హనుమంతు కంటెస్టెంట్ గా హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె మరొక సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth) తో కలిసి చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. వీళ్ళిద్దరూ అచ్చం లవర్స్ లాగే ప్రవర్తించారు. ఇక ఆ తర్వాత హౌస్ నుండి బయటకు వచ్చాక షణ్ముఖ్ హౌస్ లో ప్రవర్తించిన తీరుతో ఆయన లవర్ దీప్తి సునయన (Deepthi sunaina) అతనికి బ్రేకప్ చెప్పింది.

ఇక వీరి బ్రేకప్ జరగడానికి ప్రధాన కారణం సిరి చేసిన పని అంటూ చాలామంది అప్పట్లో సిరిపై కామెంట్స్ చేశారు. అయితే తాజాగా బిబి కేఫ్ లో అరియానా గ్లోరీ (Ariyana glory) సిరి హనుమంతు ను ఇంటర్వ్యూ చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో సిరి మాట్లాడుతూ.. నేను శ్రీహాన్ నిజంగానే విడిపోయే వరకు వెళ్ళాం. బిగ్ బాస్ (Biggboss) నుండి వచ్చాక మా పర్సనల్ విషయంలో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక అవి మరీ ఎక్కువ అవడంతో మేమిద్దరం విడిపోయే వరకు వెళ్ళాం. శ్రీహాన్ (Srihan) నన్ను వదిలేస్తానని చెప్పి ఒంటరిగా ట్రిప్ కి వెళ్ళాడు.

ఇక అలాంటి టైంలో మా బంధం విడిపోయింది అనే బాధలో నేను రోడ్లపై చెప్పులు కూడా లేకుండా తిరిగాను. అసలు ఆ టైంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కానంతగా ప్రవర్తించాను. కానీ ఆ తర్వాత మళ్లీ మేము ఇద్దరం ఒకటయ్యాం.ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. అంతేకాదు మా మధ్యన ఇంకెప్పటికీ విడిపోనంత బలమైన బంధం ఏర్పడింది. ఇక మా ఇద్దరినీ విడదీయడం ఎవరి వల్ల కాదు అంటూ సిరి (Siri Hanmanthu) ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ప్రస్తుతం సిరి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

          Click here for Follow PakkaFilmy in google News

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *