Balakrishna: International spiritual film with Balakrishna as the hero..  Famous producer who started preparations. | Producer c kalyan says he is  planning an international movie with balakrishna with ramanuja story Telugu  filmiBalakrishna తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ (Balakrishna) సినిమాలన్నీ కూడా పరిమిత బడ్జెట్లోనే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య సినిమాలు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్లో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కానీ ఇటీవల యంగ్ హీరోలు కూడా వందల కోట్ల బడ్జెట్తో సినిమాలను తీస్తూ దూసుకుపోతుంటే.. బాలయ్య మాత్రం ఇంకా రూ. 100 కోట్ల బడ్జెట్ తోనే సరిపెట్టుకుంటున్నాడు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి రూ. 200 కోట్ల ప్రాజెక్ట్ కి బాలయ్య బాబు సైన్ చేసినట్లు ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సి.కళ్యాణ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

అంతేకాదు అంతర్జాతీయంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలయ్యతో రామానుజాచార్య మూవీని ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా షూట్ చేయాలని భావిస్తున్నామని.. ఈ ప్రాజెక్టులో బాలయ్య భాగమైతే కచ్చితంగా రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని సి.కళ్యాణ్ (C.Kalyan) చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇదే విషయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే చిన జీయర్ స్వామి, రవి కొట్టారకర, ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తానని సి.కళ్యాణ్ స్పష్టం చేశారు.

అయితే దాదాపుగా 200 కోట్ల రూపాయలతో కళ్యాణ్ అమ్యూస్మెంట్ పార్కును నిర్మిస్తున్నామని .. ఈ ప్రాజెక్టును దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామని కూడా వెల్లడించారు. ఇకపోతే ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజలకు కావలసిన వినోదం, ఆహారం అన్ని ఇందులో ఉంటాయని ఆయన తెలిపారు షూటింగ్లను ఆపేసి నిర్మాతలు చర్చలు జరపడం తన దృష్టిలో ఫ్లాప్ షో అని సి. కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

Preparations are being made to produce 'Ramanujacharya' with Balakrishna at  an international level: Producer C. Kalyan

మొత్తానికైతే బాలకృష్ణ ఇప్పుడు రూ.200 కోట్ల బడ్జెట్తో ఒకేసారి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోబోతున్నారు అని తెలిసి అభిమానులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో ఆయన నటించి సక్సెస్ అయితే ఇక ఈయనను ఢీ కొట్టేవారే లేరు అని చెప్పడంలో సందేహం లేదు. https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *