Allu Ramalingaiah

Allu Ramalingaiah : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి తన స్వయంకృషి తో తెలుగు ఇండస్ట్రీ లో మెగా స్టార్ హీరోగా మారారు. ఇక అప్పట్లో ఈయనను తొక్కేయాలని చాలామంది ట్రై చేశారట.కానీ ఆయన తన ఒక్కో సినిమాతో అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీనే ఏలే రేంజ్ కి వెళ్లారు. ఇక ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఈయనను చాలామంది సూటిపోటి మాటలతో అవమానించారట.కానీ ఆ అవమానాలు అన్ని దిగమింగుకొని స్టార్ హీరోగా ఎదిగారు.

అయితే ఈయనను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah ) గారు చూసి ఇతను ఎప్పటికైనా సినిమా ఇండస్ట్రీ నే ఏలే స్థాయికి వెళ్తారు అంటూ చెప్పుకొచ్చారట. అంతే కాదు తన కూతురు సురేఖ (Surekha) ని ఇచ్చి కూడా పెళ్లి చేసాడు. ఇక ఇంటి అల్లుడు అయ్యాక చిరంజీవి సినిమాల విషయంలో అల్లు రామలింగయ్య చాలా జాగ్రత్తలు తీసుకునే వారట. అప్పట్లో ఇండస్ట్రీలో ఎక్కువగా చౌదరి కులం కు చెందిన వాళ్లే ఉండేవారట. ఇక చిరంజీవి హీరోగా ఎదిగే టైంలో సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR) రాజకీయాల్లో బిజీ అయ్యారు.

కానీ అదే టైంలో తన కొడుకు బాలకృష్ణ ని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అయితే బాలకృష్ణ (Balakrishna) ని స్టార్ చేయడానికి చిరంజీవిని సీనియర్ ఎన్టీఆర్ ఎక్కడ తోక్కేస్తారో అనే భయంతో అల్లు రామలింగయ్య తన అల్లుడు చిరంజీవి (Chiranjeevi) ని ఓ రోజు ఇంటికి పిలిపించుకొని ఎన్టీఆర్ ఇంటి గేట్ నుండి ఒక అంబాసిడర్ కారు వస్తుంది. ఆ కారులో ఉండే సీనియర్ ఎన్టీఆర్ గారికి నువ్వు ప్రతిరోజు నమస్కారం పెట్టాలి అంటూ చెప్పుకొచ్చారట. ఇక మామ చెప్పిన మాట విని చిరంజీవి ప్రతిరోజు ఎన్టీఆర్ కి నమస్కారం చేసేవారట.

అయితే ఇలా అల్లు రామలింగయ్య చెప్పడానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ కి చిరంజీవి మనవాడే కదా అనే ఒక భావన ఆయనలో కలుగుతుంది అనే ఉద్దేశంతో అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) అలా చెప్పారట. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన అల్లుడిని కాపాడుకోవడానికి అల్లు రామలింగయ్య అలాంటి ప్లాన్ వేశారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *