team india missing ms dhoni and zaheer khan2023 వన్డే ప్రపంచ కప్ ముంగిట

టీమిండియా (Team India) ప్రస్తుతం గాడి తప్పుతుందని చెప్పవచ్చు. ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆటగాళ్లు సరైన సమయంలో రాణించకపోవడం వరుస ఓటములకు కారణం అవుతుంది. 2023 వన్డే ప్రపంచ కప్ రాబోతున్న నేపథ్యంలో ఇంకా జట్టు లో సమతుల్యత లేకపోవడం క్రికెట్ అభిమానులను ఎంతగానో కలవర పరుస్తుంది. ధోని, జహీర్ ఖాన్ (MS Dhoni and Zaheer Khan) లాంటి ప్లేయర్లు లేకపోవడం ఇప్పుడు ఇన్ని వరుస ఓటములకు కారణం అవుతుంది అని చెబుతున్నారు.

ధోని, జహీర్ ఖాన్ లేని లోటు (MS Dhoni and Zaheer Khan)

ధోని ఉన్నన్ని రోజులు ఫినిషర్ గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ జట్టును ఒంటి చేత్తో గెలిపించేవాడు. అంతేకాదు ఇండియన్ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ కూడా కంటిన్యూగా వికెట్లు అందిస్తూ టీంకు ఎన్నో విజయాలను చేకూర్చాడు.

ఈ విధంగా కన్సిస్టెన్సీ చూపించే ప్లేయర్లు టీమిండియా కు కరువైపోవడంతోనే ఈ విధమైన ఓటములు ఎదురవుతున్నాయని కొంతమంది క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

బుమ్రా తప్పితే

ప్రస్తుతం హార్దిక్ పాండ్య (hardhik pandya) ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే కీలకమైన మ్యాచ్ లో హార్దిక్ ఆడక పోవడం జట్టుకు ఎంతో భారం అవుతుంది. అంతేకాకుండా బౌలర్ ల్లో ఎప్పటికప్పుడు వికెట్లు తీసే ఆటగాళ్లు లేకపోవడం మరింత మైనస్ గా మారుతుంది.

బుమ్రా తప్పితే ఏ ఒక్కరు కూడా ప్రతి మ్యాచ్ లో వికెట్ తీసే ఆటగాలుగా కనిపించడం లేదు. ఇదే కనుక కొనసాగితే భవిష్యత్తులో టీమిండియా కు ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు.

లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పై ఫోకస్

లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ పై మంచి ఫోకస్ పెడితే టీమిండియా కు మరిన్ని వికెట్లు దక్కే అవకాశం ఉంది ఇప్పటికే అర్ష దీప్ సింగ్ (Arshdeep Singh) భారత జట్టు లెఫ్ట్ హ్యాండ్ సీమరుగా సేవలు అందిస్తున్నాడు.

అయితే ఈ బౌలర్ కొత్త వాడు కావడం మరింత అనుభవం కావలసి ఉండడంతో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఈ బౌలర్ నుంచి ఎక్కువ పరుగులు రాబట్టుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *