Massive Heart attack was reason for Sobhan Babu sudden death here is what actually happens on his Death day శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు ...Sobhan Babuతెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో శోభన్ బాబు(Sobhan Babu) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ ,ఏఎన్ఆర్ , కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వీరంతా ఒక జనరేషన్ హీరోలుగా చలామణి అయ్యారు. అయితే ఇటీవల కృష్ణ మరణంతో మొదటి జనరేషన్ శాశ్వతంగా అంతమైందని చెప్పవచ్చు. ఈ ఐదు మంది హీరోలు ఒక్కొక్కరు ఒక్కోరకమైన బిరుదును సంపాదించుకుంటే శోభన్ బాబు మాత్రం ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈయన అంత అందంగా ఉన్నాడు కాబట్టే వయసు మీద పడడంతో అందం లేని సమయంలో నటిస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అన్న భయంతో సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టలేదు.

మరీ ముఖ్యంగా శోభన్ బాబు రింగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు సినిమాలలో కూడా శోభన్ బాబు (Shobhan Babu)రింగుతో పాపులారిటీని దక్కించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతే ఫ్యామిలీ హీరోగా మరెన్నో సినిమాలలో నటించి భారీ పాపులారిటీ ని దక్కించుకున్న శోభన్ బాబు ఆస్తుల విషయంలో కూడా బాగానే కూడబెట్టారు. ఎందులో పెట్టుబడి పెట్టినా నష్టపోతామని.. భూముల విషయంలో పెట్టుబడి పెడితే ఎప్పటికీ నష్టపోమని ఆలోచించే తత్వం అయినది . అంతేకాదు ఇదే విషయంలో ఎంతోమందికి సలహా ఇచ్చారు కూడా..

ఇదిలా ఉండగా ప్రముఖ హీరో మురళీమోహన్ (Muralimohan) శోభన్ బాబు ఆస్తి (Sobhan Babu) రూ. 80,000 కోట్లు మాత్రమే ఉంటుందని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత పాపులారిటీని దక్కించుకున్న ఇమాంది రామారావు.. శోభన్ బాబు ఆస్తులను బయటకు చెప్పకపోవడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. శోభన్ బాబుకు లక్ష కోట్లకు పైగానే ఆస్తి ఉంటుంది అని కానీ ఇన్కమ్ టాక్స్ కారణాలవల్ల తమ వారసులు ఆయన ఆస్తులను బయటకు చెప్పడం లేదు అంటూ స్పష్టం చేశారు.

నిజానికి శోభన్ బాబు పేరు పైన ఒక ఎస్టేట్ ఉందని.. ఆ ఎస్టేట్ చూడడానికి బయలుదేరితే ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఎస్టేట్ చూడడం పూర్తి కాదు అని దీనితో పాటు కొన్ని వేల ఎకరాల భూములు కూడా ఆయన సొంతమని ఇమంది రామారావు (Imandhi ramarao) వెల్లడించారు. ప్రస్తుతం ఇమంధి రామారావు చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Click Here And Follow PakkaFilmy On Google News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *