Rana Daggubati : మూవీ మొగల్ దగ్గుబాటి రామానాయుడు (RAMANAYUDU) వారసులుగా వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైతే సురేష్ బాబు (Suresh Babu) నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈయన కొడుకు రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రానా హీరో గానే కాకుండా బాహుబలి (Bahubali) సినిమాలో విలన్ గా నటించి పాన్ ఇండియా (Pan India) లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఈయన సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.

ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది దగ్గుపాటి అభిమానులు రానాకి ఏమైంది? ఎందుకు సినిమాల్లో నటించడం లేదు? అంటూ ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. లీడర్ (LEADER) సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత హిట్ లు ఫ్లాపులు అనే సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు రానా. ఇక ఇలాంటి రానా దగ్గుబాటి ఈ మధ్యకాలంలో విరాటపర్వం (VIRATA PARVAM) భీమ్లా నాయక్ అనే సినిమా తర్వాత మరొక సినిమా గురించి అనౌన్స్ చేయడం లేదు. అయితే ఈ హీరో మరొక ప్రాజెక్టుకి సైన్ కూడా చేయడం లేదట.

మరి ఎందుకు ఆయన ఇలా చేస్తున్నారు అంటూ చాలామంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దగ్గుబాటి హీరోలో మునుపటిలా జోష్ కనిపించడం లేదంటూ చాలామందిని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ (NTR) బయోపిక్ లో రానా దగ్గుపాటి చంద్రబాబు నాయుడు గా చేశారు. ఇక అంతకుముందు హీరోగా లేదా కీలకమైన పాత్రల్లో నటించిన రానా దగ్గుబాటి ఈ మధ్య కేవలం చిన్న చిన్న సినిమాలతో హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన విరాటపర్వం,భీమ్లా నాయక్ (BHEEMLA NAYAK)సినిమాల తర్వాత రానా మరో సినిమాకి సైన్ చేయడం లేదు.

అయితే ఆ మధ్యకాలంలో రానాకి హెల్త్ బాగాలేదు ఆయన హెల్త్ బాగవ్వడం కోసం అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక అప్పటినుండి రానా (RANA) గురించి ఏ విషయం కూడా బయటకు రావడం లేదు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ హీరో నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు అనే వార్త మాత్రం వచ్చింది. ఇక ఈ విషయం పక్కన పెడితే రానా ఎందుకు ఇలా సినిమాలకు దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతోంది. ఇక రానా సినిమాలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటో చెబితే గానీ ఈ వార్తలు ఆగేలా లేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *