Rajeev Kanakala: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే నిలబడాలి అంటే కేవలం నటన ఉంటే చాలదు.. అందుకు తగ్గట్టుగా అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటికే చాలామంది కూడా అదృష్టం లేక సినీ పరిశ్రమ నుంచి బయటకు వచ్చేశారు. సినిమాలలో ఎంత గొప్పగా నటించినా సరే ఆ అదృష్టం లేకపోతే ఏం చేయలేము. అందుకే నటనతో పాటు అదృష్టం కూడా ఉండాలి అని, ఇండస్ట్రీ వారు చెబుతూ ఉంటారు. రజనీకాంత్ (Rajinikanth) ను మొదలుకొని చిరంజీవి (Chiranjeevi) వరకు ఇలా ఎంతోమందికి నటనలో ఉన్నత స్థానాన్ని కల్పించిన రాజీవ్ కనకాల తండ్రి ( devadaasu kanakala )మాత్రం తన కెరీర్ లో అనుకున్న విధంగా సక్సెస్ పొందలేకపోయారు.

సినిమాల మీద ప్రేమతో వచ్చిన ఆయనకు ఇండస్ట్రీలో నిరాశ మిగిలింది. యానం శివారులో జన్మించిన ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చదవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ డివిజన్లో నటుడిగా కూడా సేవలు అందించారు. ఆయన గురించి సీనియర్ జర్నలిస్టు ఇమంది రామారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది. ఓ సీత కథ అనే సినిమాలో దేవదాస్ కనుక అలా అద్భుతంగా చేశారని ఆయన గుర్తు చేసుకుంటూ సినీ పరిశ్రమలో దేవదాసును తొక్కేశారు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు.

లవ్ ఫ్యాక్టర్ కూడా దేవదాసు కనకాలకు కలిసి రాలేదని అందుకే సినిమా పరిశ్రమలో నిలబడలేకపోయారని పేర్కొన్నారు దేవదాస్ చివరి సినిమా భరత్ అనే నేను ఈ సినిమా తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన మరణించడం జరిగింది. అయితే అదృష్టం పేరుగా కొంతమంది కావాలని దేవదాసు కనకాలకు అవకాశాలు ఇవ్వలేదు. అలాఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు. కానీ ఆయన వారసుడు రాజీవ్ కనకాల (Rajeev kanakala) మాత్రం అడపా గడప ఇప్పటికి సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసింది ముఖ్యంగా కనకాల కుటుంబం నుంచి టాప్ పొజిషన్లో ఉన్నది మాత్రం వారి కోడలు సుమా కనకాల అని చెప్పవచ్చు.

యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సుమా కనకాల (Suma kanakala) బుల్లితెర ఇండస్ట్రీలోనే సంచలనం సృష్టించింది. తన మాటలతో చలాకీతనంతో స్టార్ హీరోయిన్లను సైతం మెప్పించిన ఈమె ఇప్పటికీ బుల్లితెరపై తన హవా కొనసాగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *