Pooja Hegde starrer 'SSMB 28' gets a release date!తెలుగు చలనచిత్ర పరిశ్రమ కి నాగచైతన్య (Nagachaithanya) సరసన ఒక లైలా కోసం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ.. పూజా హెగ్డే (Poojahegde)మొదటి సినిమాతోనే తన అందంతో, హైట్ తో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల అభిమానాలను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని దువ్వాడ జగన్నాథం సినిమా నుంచి అలవైకుంఠపురం సినిమా వరకు భారీ పాపులారిటీని సొంతం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమా ద్వారా బుట్ట బొమ్మగా తన పేరును మార్చుకుంది. అయితే ఏమైందో తెలియదు కానీ ఇటీవల ఈమె ఏ సినిమాలో నటించినా సరే ఆ సినిమా డిజాస్టర్ గా మారుతూ ఉండడం గమనార్హం.

అలా కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మరొకవైపు కోలీవుడ్లో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించినా..ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత తెలుగు పాన్ ఇండియా సినిమా ప్రభాస్ హీరోగా వచ్చిన రాధే శ్యామ్ సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా కూడా ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇలా మూడు సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్ కొట్టిన ఈమెను అందరూ ఐరన్ లెగ్ అని తెగ కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఒక్క సినిమా మాత్రమే ఉండడం గమనార్హం.

అసలే ఐరన్ లెగ్ అనే భారాన్ని మోస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు మరొక భారాన్ని కూడా మోయక తప్పడం లేదు ఎందుకంటే ఇటీవల ఈమె ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందని వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రహస్యంగా ఆ ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోందని త్వరలోనే పెళ్లి వరకు కూడా దారితీస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలన్నింటినీ కొట్టి పారేయడానికి లేదని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు (Umaire sandhu) తను ట్విట్టర్ ద్వారా పూజా హెగ్డే ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు.

Pooja Hegde talks about working with Salman Khan in Kabhi Eid Kabhi Diwali  | Filmfare.comబాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ (Salmankhan) తో పూజా హెగ్డే రహస్య ప్రేమాయానం నడుపుతోందని ట్వీట్ చేయడం తో ఇది కాస్త బాగా వైరల్ గా మారుతుంది. మరి ఈ రూమర్ కి చెక్ పెట్టాలి అంటే పూజా హెగ్డే స్పందించక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *