Pawan Kalyan New RemakePawan Kalyan New Remake : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస సినిమాలను ఒప్పుకుంటూ పోతు అయన అభిమానులను ఎంతో ఖుషి చేస్తున్నాడు. ఇప్పటికే సుజిత్ (Sujith) దర్శకత్వంలో సినిమా ను అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా ను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే అయన ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వేసవికి దాన్ని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశాడు.

చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా క్రిష్ (Krish) ఈ సినిమా కి దర్శకత్వం అందిస్తున్నాడు. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి సుజిత్ దర్శకత్వంలోని సినిమా ను చేయబోతున్నాడు. అది కూడా తమిళ సినిమా కి రీమేక్ అన్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా హరీష్ శంకర్ (Harish Shankar) తో చేయబోయే సినిమా పై ఓ క్లారిటీ వచ్చింది పవన్ ఫ్యాన్స్ కి. గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ కాంబో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటినుంచో కోరుకున్నారు. కానీ వీలుపడలేదు. ఇన్నాళ్లకు భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) సినిమా చేయాలనీ భావించారు. అయితే ఎన్నో నెలలనుండి పెండింగ్ లోనే ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సినిమా ఉంటుందా ఉండదా అన్న అసహనం అందరిలో నెలకొంది.

ఫైనల్ గా ఈ సినిమా పై ఓ క్లారిటీ వచ్చింది. పవన్ తో హరీష్ సినిమా ఉంటుంది కానీ అది భవదీయుడు కాదని తేలిపోయింది. తమిళంలో సూపర్ హిట్ అయిన తేరి (Theri) సినిమా ను తెలుగు లో రీమేక్ (Remake) చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడట. తొందరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా లో ఇదే ట్రెండింగ్ గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *