Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఈయన సినిమాల్లో ఒక వెరైటీ ఉంటుంది. ఏ హీరో సినిమాలో లేని ఒక సరికొత్త ట్రెండు ఈయన క్రియేట్ చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఈయన అంటే పడి చచ్చేవారు ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా ఉంటున్నారు. జనసేన పార్టీ (Janasena Party) ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే చాలా మంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు చేసి కనుమరుగైపోయిన వారు ఉంటారు.

కానీ వాళ్ళు చేసిన ఒకటి రెండు సినిమాల వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికి కూడా వాళ్ళని చూస్తే గుర్తుపట్టేలా ఉంటారు. ఇక ఈ విషయంలో తమ్ముడు (THAMMUDU) సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రీతి జింగానియా (PREETHI JINGANIA) కాకుండా లవ్లీ అనే మరొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఇక ఈ లవ్లీ అనే అమ్మాయిని పవన్ కళ్యాణ్ పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసి బొక్క బోర్లా పడతారు.ఇక హీరోయిన్ అసలు పేరు అదితి గోవాత్రికర్ (ADITHI GOVATRIKAR). ఇక ఈ హీరోయిన్ పేరు చెబితే ఎవరికీ గుర్తు రాదు కానీ తమ్ముడు సినిమాలో లవ్లీ అనే క్యారెక్టర్ అంటే చాలామంది ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఈ హీరోయిన్ కోసం హే పిల్ల నీ పేరు లవ్లీ అనే పాట కూడా పాడారు. ఈ పాట అప్పట్లో చాలా హిట్ అయింది. ఇక ఈ హీరోయిన్ తెలుగులో చేసింది ఒక సినిమానే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తమ్ముడు సినిమా తోనే తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ కి చెక్కేసి పూర్తిగా అక్కడే సెటిల్ అయిపోయింది. ఇక ఈ హీరోయిన్ చిన్న వయసు నుండే మోడలింగ్ చేస్తూ సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. సినిమాల్లోకి రాకముందు మెడిసిన్ చదివే రోజుల్లోనే ముఫజల్ (MUJAFAL)అనే వ్యక్తితో డేటింగ్ చేసి ఇండస్ట్రీ లోకి రాకముందే పెళ్లి చేసుకుంది.

ఇక వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు కూడా పుట్టారు. కానీ పిల్లలు పుట్టాక కొన్ని రోజులకు ఏమైందో ఏమో తెలియదు కానీ గొడవలు పెరిగి విడాకులు తీసుకున్నారు. ఈమె విడాకులు తీసుకున్నాక కూడా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ సినిమాల్లో మెల్లిమెల్లిగా అవకాశాలు తగ్గడంతో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెబ్ సిరీస్ లలో అలాగే టీవీ షోలలో కనిపిస్తోంది. అయితే తమ్ముడు సినిమాలో అప్పుడు నటించిన అదితి గోవాత్రికర్ (ADITHI GOVATRIKAR)కి ఇప్పుడు మనం చూసే లవ్లీ కి చాలా తేడా వచ్చింది. ఇక హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *