Jabardasth and Adirindi Actress Sayta Sri Age, Height, Biography, Family, Photos, Imagesjabardasth satya sree : జబర్దస్త్ ఎంతోమందికి మంచి పేరు తీసుకొచ్చింది. ఊరు పేరు లేని వాళ్ళకి కూడా ఇల్లు, కార్లు కొనుక్కునే స్టేజ్ ను అందించింది అంటే జబర్దస్త్ కి (Jabardasth) వీరంతా ఎంత రుణపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అయితే జబర్దస్త్ స్టేజి మీద నుంచి ఎంతోమంది బయట కూడా వెళ్లిపోయారు. ఇప్పటికీ వెళ్తూనే ఉన్నారు.. వస్తూనే ఉన్నారు. అలా మొదట జడ్జిగా వ్యవహరించిన నాగబాబు (NGABABU) బయటకు వెళ్లడంతో ఆయనతో పాటుగా చమ్మక్ చంద్ర కూడా వెళ్లిపోయారు. చమ్మక్ చంద్ర వెళ్ళిపోవడంతో ఆయన గ్రూప్ లోనే ఆయనకు భార్యగా నటిస్తున్న సత్య శ్రీ (Sathya Sree) కూడా వెళ్లిపోయింది.

ఇప్పుడు మాత్రం చమ్మక్ చంద్రను వీడింది. సత్య చమ్మక్ చంద్ర సినిమాలలో బిజీగా ఉండడంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టడం లేదు..దీంతో ఆమెకు అక్కడ అంతగా పని లేకుండా పోయినట్టు తెలుస్తోంది. దీంతో సత్య మళ్ళీ బుల్లితెరపై బిజీ కావాలని జబర్దస్త్ షో కి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత వారమే సత్య శ్రీ ఎంట్రీ ఇచ్చింది. తన స్కిట్ తర్వాత ఎమోషనల్ అవుతూ జరిగిందంతా తెలిపింది. నా కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి..

ఈ స్టేజ్ ని నేను చాలా మిస్ అయ్యాను.. ఇది నా కుటుంబం.. మళ్లీ వచ్చినందుకు సంతోషంగా ఉంది.. బయటకు వెళ్తే ఉట్టి సత్య శ్రీ (Sathya Sree) అని కాదు జబర్దస్త్ సత్య అని పిలుస్తున్నారు.అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అసలు గ్యాప్ ఇవ్వను తగ్గేదేలే అని ఎమోషనల్ అయింది. సత్యా తన జబర్దస్త్ స్కిట్ ఎపిసోడ్ వీడియోను పోస్ట్ చేస్తూ నాకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చిన షో స్టేజ్ ఇదే ..మళ్లీ ఇక్కడికి రావడం ఈ కుటుంబంతో ఒకటిగా కలిసిపోవడం ఆనందంగా ఉంది.

ఇకపై మీ అందరిని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా అని మల్లెమాల టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అని ఎమోషనల్ అయింది . రోహిణి పేరు ట్యాగ్ చేయడంతో ఇదంతా రోహిణి (ROHINI) చేయించినట్టుగా అనిపిస్తుంది. రోహిణి మల్లెమాల టీమ్ కి సత్యకు మధ్య వారధిగా నిలిచి ఆమెను మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది చూసిన కొంతమంది ఛీ.ఛీ. అప్పుడు కాదని వెళ్ళిపోయి.. ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళి జబర్దస్త్ లోకి వచ్చారా అంటూ మరికొంతమంది చాలా అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *