మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తమ్ముడు గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక మొదటి సినిమాతోనే ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రెండో సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఈయన నటించిన తొలిప్రేమ(Tholiprema) సినిమా అప్పటి జనరేషన్ కే కాదు ఇప్పటి జనరేషన్ వాళ్ళని కూడా ఆకట్టుకుంటుంది. ఇలా తనదైన హీరోయిజం తో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఈ విషయం పక్కన పెడితే..తాజాగా హీరో అడివి శేష్ (Adivi sesh)పవన్ కళ్యాణ్ అలాగే తన కొడుకు అకీరానందన్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 (Hit 2)సినిమా ఈమధ్యనే రిలీజయ్యి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి నాని నిర్మాత గా వ్యవహరించారు. అలాగే హిట్ 3సినిమాలో నాని(Nani) హీరోగా రాబోతున్నారు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా అడివి శేష్ పవన్ కళ్యాణ్ అఖిరా నందన్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అలాగే అకిరా నందన్ ఇద్దరిలో చాలా క్వాలిటీస్ వేరుగా ఉంటాయి.

కానీ వీళ్ళిద్దరిలో ఉన్న క్వాలిటీస్ బెస్ట్. అసలు వీరిద్దరిలో ఒక్క క్వాలిటీలో అయినా పోలిక ఉండదు. పవన్ కళ్యానేమో యూత్ లో ఒక స్పిరిట్ నింపుతూ కొత్త ఉత్సాహాన్ని తెస్తారు. ఇక ఈయన మాట్లాడే మాటలు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కనెక్ట్ అవుతాయి. కానీ అకిరా మాత్రం చాలా ఇన్నోసెంట్,సైలెంట్. కానీ అకిరా నందన్ (Akira nandan)ది కూడా చాలా మంచి వ్యక్తిత్వం. పవన్ కళ్యాణ్ గారు ఫైర్ లాంటి వారైతే అకిరా నందన్ బంగారం. వీళ్ళిద్దరికీ ఏ ఒక్క విషయంలో కూడా సంబంధం ఉండదు. వీరిద్దరూ వేర్వేరు ఎనర్జీలు కలిగిన డిఫరెంట్ వ్యక్తులు.

ఇక నేనే హైట్ అనుకుంటే అకిరా నందన్ నాకంటే హైట్. నేను తనని చూడాలంటే తల పైకెత్తల్సిందే. ఇక అకిరా సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ అతనికి ఎక్కువగా మ్యూజిక్ అంటే ఇష్టం. అలాగే అకిరా ప్రస్తుతం చిన్నపిల్లడే. అయితే భవిష్యత్తులో తను ఏం అవ్వాలనుకుంటాడో అదే అవుతాడు. ఎందుకంటే మనం హీరో అవ్వాలని ఫోర్స్ చేయలేం కదా.తనకు నచ్చింది తాను చేస్తాడు అంటూ అడివి శేష్ అకిరా నందన్,పవన్ కళ్యాణ్(Pawan kalyan) గురించి కొన్ని విషయాలు చెప్పారు. ప్రస్తుతం అడివి శేష్(Adivi Sesh)చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *