Actress Soundarya pregnant when she died in helicopter crash?తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. చెప్పాలంటే వారి మీద ఉన్న అభిమానంతో మొదటి రోజే థియేటర్లకు పరిగెత్తే అంత అభిమానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు సౌందర్య. ఈమె తెలియని తెలుగువారు ఉండరు. మామూలుగా చిత్ర పరిశ్రమలో గ్లామర్ గా మరియు అందంగా, అనుకువగా ఉండే హీరోయిన్ సౌందర్య.

సినీ రంగంలో గ్లామర్ ఉండి , నటన ప్రాధాన్యత ఉంటే ఆ నటి ఏకచత్రాధిపత్యం వహించటం ఖాయం. అలాంటి అందం, అభినయం కలబోసుకుని ఉన్న హీరోయిన్ సౌందర్య. అయితే ఈమె చిన్న చిన్న పాత్రలతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించి.. తన నటనతో ఇటు దర్శకులను.. ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. సౌందర్య అప్పట్లో ఉన్న అగ్ర హీరోలు అందరితో చాలా సినిమాలలో నటించింది.

సౌందర్య నటించిన పలు చిత్రాలతో చాలా క్రేజ్ ను సంపాదించుకుంది. అందులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా, పవిత్ర బంధం, పెదరాయుడు ఇలా చాలా సినిమాల్లో నటించింది. తనను గొప్ప నటిగా చేసిన కారణం ఏమిటంటే సౌందర్య ఏ పాత్ర పోషించిన అది నటించినట్లు కాకుండా జీవించినట్లు ఉండేది. అందుకే సౌందర్యకు సహజ నటి అనే బిరుదు కూడా వచ్చింది. అయితే ఇదిలా ఉండగా సౌందర్యకు ఒక తీరని కోరిక మిగిలిపోయింది.

అదేమిటంటే ఒక సినిమాకు అయినా దర్శకత్వం చేయాలనే కోరిక ఉండేదట. కానీ అది నెరవేరకుండానే తను దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. ఇలా సౌందర్య మరణించిన సంగతి మనందరికీ తెలుసు. ఈమె చాలా సినిమాల్లో నటించినప్పటికీ దర్శకత్వం చేయాలనే కోరిక బలంగా ఉండేదట. కానీ తన కోరిక తీరకుండానే సౌందర్య మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇప్పటికి కూడా సౌందర్య గారు ఉండింటే ఖచ్చితంగా తన కోరికను నెరవేర్చుకునేవారు. కానీ ఈ సంఘటన తర్వాత అభిమానులు ఒక అందాల నటిని కోల్పోయారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *