Sofia Hayatటీమిండియా క్రికెట్ ప్లేయర్ రోహిత్ శర్మ (Rohit Sharma) 2015 వ సంవత్సరంలో రితిక సజ్జే (Rithika Sajdeh) ను వివాహం చేసుకోవడానికి ముందే ఒక ప్రముఖ నటి గాయని సోఫియా హయత్ (Sofia Hayat) తో డేటింగ్ చేసిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వీరిద్దరూ కలసి ఎన్నో సార్లు కెమెరాకు కూడా చిక్కారు. ఇక కొన్ని సార్లు విహార యాత్రల కోసం విదేశాలకు కూడా కలిసి వెళ్లడం జరిగిందట. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో చాలా వైరల్ గా మారాయి. అయితే అనుకోని కారణాలవల్ల రోహిత్ శర్మ, సోఫియా విడిపోవడం జరిగింది. అయితే అందుకు గల కారణం ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2012 లో సోఫియా హయత్ రిలేషన్ షిప్ ఉన్నారనే వార్తలు బాగా గట్టిగా వినిపించాయి. వీరిద్దరు ఆ ఏడాది పలుసార్లు కలిసి ఉండడం తో కొన్ని ఫోటోలు కూడా మీడియా కంట పడ్డాయి. అప్పట్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అంతే కాకుండా 2014వ సంవత్సరంలో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన కొన్ని మ్యాచ్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు చేయడం జరిగింది. అందుకు అతనికి బహుమతిగా సోఫియా హయత్ తన న్యూడ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకొని తన ప్రేమను చాటింది.

అయితే అప్పటి వరకు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరిద్దరు కొన్ని రోజుల తర్వాత విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి గల ముఖ్య కారణం ఎవరంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ అనేక వార్తలు బయటకు వినిపించాయి. అందులో నిజమెంతో ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు. అయితే మహిళలతోపాటు వెలుపల కూడా విరాట్ కోహ్లీ (Virat Kohli) మెరుగైన ఆటగాడని సోఫియా అప్పట్లో తన ట్విట్టర్ నుంచి తెలియజేసింది. అందుకే రోహిత్ శర్మ తనను తిరస్కరించినట్లు ఆమె తెలియజేసింది.

రోహిత్ శర్మ (Rohit Sharma) బ్రేకప్ అయిన తర్వాత సోఫియా హయత్ (Sofia Hayat) సన్యాసిని గా మారింది అంటూ గతంలో కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ తరువాత ఒక మోడల్ సోఫియా ను వివాహం చేసుకున్నట్టుగా వార్తలు వినిపించాయి. మరి ఈ విషయాలన్నీ నిజమో కాదో తెలియాలంటే వీరందరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *