సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్ర హీరో అనగానే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ఇప్పుడు ఏ హీరో అయినా సరే ఆ సినిమా బాగుంటేనే.. థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇక కంటెంట్ నచ్చితే చాలు అతను పెద్ద హీరోనా లేక చిన్న హీరోనా అని తేడాలు లేకుండా బ్రహ్మరథం పట్టేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక స్టార్ హీరో అయినా మాస్ మహారాజ్ రవితేజకు (Ravi Teja) షాకింగ్ న్యూస్ తగిలింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఈయనకి ఎంతో మంచి పేరును అలాగే క్రేజ్ ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసింది.

ఈ క్రమంలోనే తమిళ్ హీరో కి, రవితేజ కి మంచి అనుబంధం ఉంది. ఆయన ఎవరో కాదు విష్ణు విశాల్. ఈయన నటించిన సినిమాలను రవితేజ (Ravi Teja) సపోర్టు చేస్తున్నాడు. కానీ ఆ సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సొంతం చేసుకోలేకపోతున్నాయి.విష్ణు విశాల్ రీసెంట్గా నటించిన “ఎఫ్ఐఆర్” సినిమాకు కూడా తెలుగులో రవితేజ మద్దతు ఇచ్చాడు.ఈ సినిమాకి దర్శకుడిగా మను ఆనంద్ చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడం.. అంతేకాకుండా విష్ణు విశాల్ అంటే చాలామందికి తెలియకపోవటం వలన ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది. ఈ మూవీ ఇక మాస్ మహారాజ్ రవితేజ మొట్ట మొదటిసారిగా ఒకరికి సపోర్ట్ చేశారు. కానీ వారు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.అప్పటికి కూడా రవితేజ ఆయనకి సపోర్ట్ చేయకుండా ఉండలేకపోయాడు. అంటే ఆయన తీసిన మరో సినిమాకి కూడా తెలుగులో సపోర్టుగా నిలబడ్డాడు.

ఆ సినిమా పేరు మట్టికుస్తీ. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలయ్యింది. ఈ సినిమాకి చల్ల అయ్యవు దర్శకత్వం వహించాడు. ఈ తమిళ్ సినిమా కుస్తీ పోటీల నేపథ్యంలో ప్రధానంగా సాగుతుందని అనుకున్నారు. దీంతో ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదని అర్థం అవుతోంది. తొలిరోజే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాని ఆదరించలేదనీ తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒకటి అర్థమైంది. అదేమిటంటే రవితేజ బ్రాండ్ పనిచేయలేదని నిర్మాతగా మరోసారి విఫలమయ్యాడు అని కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలాంటి దూల వల్లే రవితేజ మొత్తానికే నష్టాన్ని చవి చూశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *