రజనీకాంత్ (Rajinikanth).. ఈ పేరు చెబితే చిన్నపిల్లలు కూడా తెగ సంబరపడిపోతుంటారు. ఆ పేరులో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియదు కానీ ఈయన ముసలి ఏజ్ లో ఉన్నా కూడా ఈయనకు యంగ్ హీరో కి ఉన్నంత క్రేజ్ ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ తమిళనాడు ఆరాధ్య దైవం అనే మాటకు అసలు సిసలు నిర్వచనం రజనీకాంత్. రజనీకాంత్ మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నలుగురితో కలిసి ఒక స్లమ్ ఏరియాలో 20 రూపాయలతో గదిలో అద్దెకి ఉండేవారు.

తర్వాత కాలంలో మంచి మంచి సినిమాల్లో నటించి స్టార్ హీరోగా అంచలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏకంగా ఒక్కొక్క సినిమాకి కొన్ని కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. రజనీకాంత్ సినిమా అంటే చాలామంది నిర్మాతలు కళ్ళు మూసుకొని ఉండొచ్చు అనే బ్రాండ్ రజనీకాంత్ కు సొంతం. ఎందుకంటే ఈయన సినిమాలకు కలెక్షన్ ల పరంగా అన్ని వసూళ్లు వస్తాయని ఇండస్ట్రీలో టాక్. రజనీకాంత్ ఒకప్పుడు ఆకతాయిలా ఉండేవారు.కానీ రాను రాను రజనీకాంత్ ని చాలామంది అభిమానులు దేవుడిగా చూడటం మొదలుపెట్టాక అప్పటినుంచి ఆయన తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని పూర్తిగా మారిపోయారు.

రజనీకాంత్ చాలామందికి సహాయం చేసి తన కంటికి కనిపించిన ఏ ఒక్కరికి కష్టాలు ఉండకుండా చూసుకునేవారు. ఇక రజనీకాంత్ ఇంటికి ఓ రోజు స్టార్ నటి రమాప్రభ వెళ్లారట. ఇక ఆ టైంలో రమాప్రభ శరత్ కుమార్ (SHARATH KUMAR) తో విడిపోయి తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకొని దీనస్థితిలో రజనీకాంత్ ఇంటికి వచ్చిందట. ఇక ఆ టైంలో రమాప్రభ ని చూసిన రజనీకాంత్ నీ గురించి నాకేం అవసరం.

నీ తెలివితక్కువతనం వల్ల నువ్వే మోసపోయావు అని తిట్టకుండా తన డ్రాలో ఉన్న 100 రూపాయల కుప్పను అలాగే చేతిలోకి పట్టుకొని రమాప్రభ (RAMAPRABHA) కి ఇచ్చారట. ఇక ఆ డబ్బులు ఆ రోజుల్లోనే 40 వేలు. దీంతో ఆమె చాలా ఆనందంతో బయటికి వచ్చిందట. ఇలా రజనీకాంత్ తన ఇంటికి సహాయం కోసం వచ్చిన ఏ ఒక్కరిని ఉత్తి చేతులతో పంపించకుండా తన దగ్గర ఏది ఉంటే అది సహాయం చేసేవారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *