పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. అన్నయ్య వేసిన దారంట వెళ్ళిపోలేదు. తనకంటూ ఒక దారిని సృష్టించుకుని అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో అగ్ర హీరోగా ముద్ర వేయించుకున్నాడు. పవర్ స్టార్ గా తనదైన న‌ట‌న‌, వ్య‌క్తిత‌త్వం, మేనరిజమ్స్ తో కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతూనే.. మరోవైపు ఏపీ రాజకీయాల్లో తనదైన దూకుడును చూపిస్తున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `బ‌ద్రి (badri)` ఒక‌టి. అయితే బద్రి సినిమా టైం లో పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ప‌వ‌న్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే `మీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు..?` అన్న‌ పవన్ కు ఎదురైంది.

అందుకు ఆయన త‌న‌తో ఫ్రెండ్‌షిప్‌కు అస‌లు అమ్మాయిలు ఇష్ట‌ప‌డేవారు కాదంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. పవన్ క‌ళ్యాణ్ (pawan kalyan) మాట్లాడుతూ..`నాకు పెద్ద‌గా గ‌ర్ల్ ఫ్రెండ్స్ లేరు. అస‌లు లేర‌నే చెప్పాలి. చదువుకునే రోజుల్లో అమ్మాయిలు అసలు నాతో ఫ్రెండ్‌షిప్‌కు చేసేందుకు ఇష్టపడేవారు కాదు. అమ్మాయిలు స్నేహం చేసేందుకు నాలో ప్లస్ పాయింట్స్ ఏమీ ఉండేవి కావు. నా వైపు ఆకర్షితులు కావడానికి వాళ్లకు ఒక్క కారణం కూడా దొరకదు. అలా ఉండేవాణ్ణి. నథింగ్ స్పెషల్ విత్ మి` అంటూ చెప్పుకోచ్చారు.

ఒక‌ప్పుడు పవన్ వైపు ఒక్క అమ్మాయి కూడా చూడ‌లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేడీ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందరో అమ్మాయిలు పవన్ పేరు వింటేనే పూనకాలతో ఊగిపోతారు. స్టార్ హీరోయిన్లు సైతం ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అంతటి ఇమేజ్ ను పవన్ సొంతం చేసుకున్నాడు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu)` పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇందులో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రోవైపు హ‌రీష్ శంక‌ర్ తో `భవదీయుడు భగత్ సింగ్` సినిమా చేసేందుకు క‌మిట్ అయ్యారు. ఇక రీసెంట్ గా `సాహో` ఫేమ్ సుజిత్ (Sujith) తో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.

Click Here And Follow PakkaFilmy On Google News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *