Pawan Kalyan: పవన్ గేమ్ లో బలైన నిర్మాత?... అయోమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్!సినీ రంగంలో ఎలా అంటే అలా ముందుకు పోలేరు. కాసింత ప్రతిభ, లక్ ఉంటేనే ముందుకు సాగిపోతారు.ఎందుకంటే ఎంత కష్టపడినా దానికి తగ్గ ఫలితం దక్కదు. అందుకే చాలామంది నటులు నటీమణులు సినిమాలో కొన్ని రోజులే కనిపిస్తూ ఉంటారు. ఆ తరువాత కనుమరుగవుతారు. ఒకవేళ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన అట్టడుగు స్థాయికి దిగిపోతారు. ఒకవేళ ప్రతిభ, కష్టపడే తత్వము నెట్వర్క్, దాంతోపాటు కొంచెం అదృష్టం ఇవన్నీ కలబోస్తేనే సినీ రంగాన్ని ఏలొచ్చు .

కానీ హీరోయిన్స్ అయితే ఒక సినిమాలో కనబడితే మళ్లీ కనపడొచ్చు కనపడకపోవచ్చు. డైరెక్టర్స్ , నిర్మాతల విషయానికి వస్తే వారు కూడా అంతే. ఒకటి రెండు సినిమాలతో కనపడకుండా పోయినవారు కూడా వున్నారు.. ఒకవేళ వాళ్ల సినిమాలు హిట్ అయితే ఓకే కాకపోతే అంతే సంగతులు. అయితే ఇప్పుడు ఒక హీరో గురించి అతనితో తీసిన డైరెక్టర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ హీరో ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).

ఈయన చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా వకీల్ సాబ్.. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది వేణుశ్రీరామ్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ను సాధించిందో మనకి తెలుసు. కానీ ఆ డైరెక్టర్ కి మాత్రం ఏమైందో తెలియదు కానీ మరో సినిమా తీయలేదు. కాటమరాయుడు సినిమా డైరెక్టర్ కిషోర్ కుమార్ కూడా మరో సినిమా ప్రకటించలేదు. భీమ్లా నాయక్ తో పవన్ ఇచ్చిన సాగర్ కే చంద్ర (Sagar k Chandra)కూడా తర్వాత మరో ప్రాజెక్టు చేయలేదు.

పవన్ కి ఎంతో క్రేజ్ తెచ్చిన సినిమా ఖుషి ఈ సినిమా డైరెక్టర్ ఎస్ జె సూర్య.. ఆ తరువాత పవన్ తో కొమరం పులి సినిమా తీశాడు . అది ప్లాప్ కావడంతో ఇక తెలుగులో ఏ సినిమాను ప్రకటించలేదు. పవన్ తీసిన బంగారం సినిమాను ధరణి (Dharani) తెరకెక్కించాడు. ఆ తరువాత ఆయన తెలుగులో ఏ సినిమాను చేయలేదు.ఇలా చాలామంది డైరెక్టర్లు 1 ,2 సినిమాలు తీసి అటకెక్కుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *