KGF Thatha Krishna G Rao No More : ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ (KGF) సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్ లు కూడా భారీ వసూళ్లను తెచ్చి పెట్టాయి. నటీనటులకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

హీరో కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టగా ఈ సినిమా లో నటించిన ఇతర నటీనటులకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఈ సినిమా లో మంచి పాత్ర చేసి అందరికి గుర్తుండిపోయేలా చేసిన నటుడు కృష్ణా జి రావు (Krishna G Rao) 70 ఏళ్ల వయసులో మరణించాడు.

కేజిఎఫ్ తాత అని పిలువబడే అయన సడెన్ గా ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోగా ఆసుపత్రి కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. శ్వాశ కొస సంబంధిత వ్యాధి తో బాధపడుతున్న అయన ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా మరణించారు.

అయన ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలలో నటిస్తున్నాడు. ప్రభాస్ సలార్ (Salar) లో కూడా అయన ఓ పాత్ర పోషిస్తున్నాడు. మరి అయన మరణం ఇండస్ట్రీ కి తీరని లోటు అనే చెప్పాలి. అయన మరణాన్ని సంతపిస్తు చాలామంది సెలెబ్రిటీలు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *