జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి (sridevi)-బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్‌ ముద్దుల కుమార్తె అయిన ఈ అమ్మడు `ధడక్` అనే హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క సినిమా కూడా జాన్వీకి సరైన హిట్ ను అందించలేక పోయింది. ప్రస్తుతం జాన్వీ చూపులన్నీ సౌత్ పైనే ఉన్నాయి.

సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ అగ్ర హీరోయిన్ గా ముద్ర వేయించుకోవాలని తెగ కలలు కంటోంది. అయితే సౌత్ లో మాత్రం జాన్వీ కపూర్ కి సరైన ఆఫర్లు రావ‌డం లేదు. దీంతో ఈ బ్యూటీ కాస్త ముందే క‌క్కుర్తి పడింది. ఓ సౌత్ స్టార్ హీరోకి ఫోన్ చేసి ఆఫర్ ఇవ్వమని అడిగేసింద‌ట‌. పైగా ఈ విషయాన్ని జాన్వీ కపూర్ (janhvi kapoor) స్వ‌యంగా వెల్లడించడం గ‌మ‌న్నార్హం. ఇకపోతే జాన్వీ ఆఫర్ అడిగింది మరెవరినో కాదు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని అట.

విజయ్ సేతుపతి (vijay sethupathi) అంటే జాన్వీకి మహా ఇష్టమట `ఆయన నటించిన నానుమ్‌ రౌడీ సినిమాను వందసార్లు చూశాను. తర్వాత ఓసారి ఆయనకు ఫోన్ చేసి సార్ మీకు పెద్ద అభిమానిని.. మీతో కలిసి నటించాలని ఉంది. ఛాన్స్ ఇస్తే ఆడిషన్ కు వస్తాను` అని చెప్పిందట. ఇక జాన్వీ కపూర్ మాటలకు విజయ్ సేతుపతి ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాట. జాన్వీ మాట్లాడుతున్నంత సేపు అయ్యో.. అయ్యో.. అంటూ సరదాగా నవ్వుతూ ఉన్నారే తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదట.

ఆయ‌న సిగ్గు పడుతున్నారో లేక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో తనకు అర్థం కాలేదని.. కాకపోతే ఆయన ఆశ్చర్యపోయారని అర్థమైందంటూ జాన్వీ క‌పూర్‌ చెప్పుకొచ్చింది. దీంతో జాన్వీ కామెంట్స్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి. కాగా, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) హీరోగా `ఉప్పెన‌` ఫేమ్ బుచ్చిబాబు సానా తెర‌కెక్కించ‌బోతున్న `ఆర్సీ 16`(RC15) లో హీరోయిన్ గా ఎంపిక అయింద‌ని వార్త‌లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *