ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో (Jabardasth) ఎంతోమంది కమెడియన్లకు దారి చూపింది. దీంతో తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది కమెడియన్లకు. ఈ షో అందులో చాలామంది లేడీ గెటప్ లను వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ అలరిస్తూ ఉంటారు. ఇంకా అందులో లేడీ గెటప్ వేసే మగవాళ్లు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు శాంతి స్వరూప్ (Shanthi swaroop).. ప్రస్తుతం శాంతి స్వరూప్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా అందులో పెట్టిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.

ఈ విషయం మీద శాంతి స్వరూప్ తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. శాంతి స్వరూప్ జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు ఒక కారు పక్కన నిలబడి ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటో షేర్ చేసిన కొంతసేపటికి పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ లో కొందరు ఎవరి పక్కన పడుకొని కారును సంపాదించావు అనే కామెంట్స్ చేశారట. ఆ కామెంట్స్ కు శాంతి స్వరూప్ చాలా ఫీల్ అయ్యానని శాంతి స్వరూప్ తెలియజేశారు.

అయితే శాంతి స్వరూప్ ఏం చెప్పారంటే జబర్దస్త్ (Jabardasth) షోలో నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయినీ కూడా కూడబెట్టి ఆ కారును కొనుక్కున్నాను. అలా కొనుక్కున్న నా కారుతో ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశా నేను ఎవరి పక్కన పడుకొని కొనుక్కోలేదు. ఒకవేళ అలా కనుక చేసి ఉంటే నేను ఏ రేంజ్ లో ఉండే దాన్నో నాకే తెలియదు.బంగ్లాలు కార్లు లాంటివి ఎన్నో కొనుక్కునే దాన్ని అంటూ శాంతి స్వరూప్ ఆయన మాటల్లో తెలియజేయడం జరిగింది.

నేను నా టాలెంట్ తో జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తూ నేను సంపాదించుకున్న డబ్బుతో కారు (Car) కొన్నాను అంటూ తనని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు శాంతి స్వరూప్. ఇలా శాంతి స్వరూప్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *