RGV: ఆర్జీవీ వ్యూహం సినిమా అప్ డేట్టాలీవుడ్ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. ఈయన తెలుగువారికే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమతో సంబంధం లేకుండా దాదాపుగా అందరికీ ఈ వ్యక్తి తెలిసినవారే కావడం గమనార్హం. ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. చాలా సినిమాలు హిట్లను కూడా సాధించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈయన సినిమాలు చాలా తక్కువగా వచ్చి చాలా తక్కువగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ విషయంపై తన అభిమానులు నిరాశ చెందుతున్నారని.. అయితే కచ్చితంగా ఈసారి అభిమానులకు నచ్చేలా పవన్ కళ్యాణ్ రాజకీయ నేపథ్యంలో అద్భుతమైన కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆర్జీవి..

ఇందులో ఉండగా ఈ సినిమాకి ముందు డేంజరస్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ అప్సర రాణి మరియు నైనా గంగూలి తదితరులు మెయిన్ లీడ్ పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం లెస్బియన్ గర్ల్స్ మధ్య లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయకూడదని కొంతమంది పోరాటాలు కూడా చేశారు. కానీ రాంగోపాల్ వర్మ వీటన్నింటిని పక్కకు నెట్టి ముందుకు సాగి థియేటర్లలో విడుదల చేసి తానేంటో నిరూపించుకున్నాడు వర్మ.

ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా రాంగోపాల్ వర్మ కొంతమంది అందమైన అమ్మాయిలతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అంతేకాకుండా చాలామంది అందమైన అమ్మాయిలు రాంగోపాల్ వర్మను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి శృంగారం గొప్పదా..? లేక ప్రేమ గొప్పదా..? అని అడిగితే రాంగోపాల్ వర్మ ఇచ్చిన సమాధానానికి ఆ అమ్మాయిలకి దిమ్మతిరిగిపోయినట్టు అయింది.

అదేమిటంటే శృంగారం మన లైఫ్ లో ఒక పార్ట్ అలాగే ప్రేమ కూడా ఒక పార్ట్.. కానీ శృంగారంలో ఉన్న క్లారిటీ ప్రేమలో ఉండదు. అని ఆయన మాటల్లో చెప్పారటప్రేమ అనేది కొంతకాలమే బాగుంటుంది. శృంగారం ఎప్పటికీ బాగుంటుంది. అనే సంచలన వ్యాఖ్యలను చేశారు. ఆ తర్వాత మరో యువతి ఏకంగా ఆర్జీవి గారిని కౌగిలించుకుంటాను అని అడిగిందట.ఆ మాటకి రాంగోపాల్ వర్మ వెంటనే వచ్చి హగ్ చేసుకో అన్నారట. దీంతో ఆ యువతి సంతోషంగా హగ్ ఇచ్చింది. ఆనందంలో ఊగిపోతున్న ఆ అమ్మాయి 10 రోజులపాటు స్నానం చేయను.. ఎందుకంటే వర్మ తనను కౌగిలించుకున్న ఫీలింగ్ పోతుందని తెలిపింది. అయితే వర్మ కోసం పరితపించే అమ్మాయిలను చూసి నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *