తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో నితిన్ అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.. అలాంటి యంగ్ హీరో తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైనటువంటి మాచర్ల నియోజకవర్గం(MACHARLA NIYOJAKAVARGAM) సినిమాతో బోల్తా పడ్డాడని చెప్పవచ్చు.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయానందుకుంది ఈ మూవీ. దీంతో నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయబోతున్నారనేది..

వివరాలు చూద్దాం.. రీసెంట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు హీరో నితిన్.. ఇది ఆయన కెరియర్ లోనే మరొక ఫెయిల్యూర్ మూవీగా మిగిలిపోయింది. దీంతో ఆయన తర్వాత వచ్చే మూవీ ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే నెక్స్ట్ ప్రాజెక్టును రైటర్ మరియు డైరెక్టర్ వక్కంతం వంశీ తో మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భీష్మ (BHISHMA)వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో కూడా చేతులు కలపడం కోసం ఈ యంగ్ హీరో రెడీ అవుతున్నారట.

ఈ తరుణంలో నితిన్ తన భార్యకు దూరంగా ఉండబోతున్నారని విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.. కానీ ఈ వ్యవహారం అంతా తన నిజ జీవితంలో కాదని కేవలం రీల్ లైఫ్ లో అని అంటూ అంటున్నారు.. వెంకీ కుడుముల(VENKI KUDUMULA) డైరెక్షన్లో రానున్న ఈ మూవీలో తన భార్య నుంచి విడాకులు తీసుకొని తన జీవితాన్ని గడుపుతారని.. ఈ కథను బేస్ చేసుకుని సినిమా మొత్తం నడవబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఈసారి నితిన్(NITHIN) ని ఎలాగైనా గట్టెక్కించాలనే ఆలోచనతో కామెడీతో పాటుగా సస్పెన్స్ సన్నివేశాలతో ఉత్కంఠ భరితమైన సినిమాను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట దర్శకుడు. ఈ కథ బాగా నచ్చడంతో ఓకే చేశారట.. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్టు సమాచారం అందుతుంది.. మరి చూడాలి వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా నితిన్ కు ఇలాంటి విజయాన్నందిస్తుందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *