Flora Saini : ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఎక్కడైనా సరే ఆడపిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు వదలడం లేదు. చిన్నపిల్ల నుండి పండు ముసలి దాకా ఆడవాళ్ళు అయితే చాలు ఎవరైతే ఏంటి అనుకునే విధంగా కొంతమంది మృగాల లాంటి మగాళ్లు తయారయ్యారు.. ఈ విషయంలో సాధారణం జనాలే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇక కాస్టింగ్ కౌచ్ ద్వారా చాలామంది ఈ విషయాలు చెప్పారు. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది సీనియర్ నటీమణులు వాళ్ళు హీరోయిన్స్ గా చేసినప్పుడు ఎలాంటి లైంగిక వేధింపులు ఎదుర్కున్నారో వాటన్నింటిని ధైర్యంగా చెబుతున్నారు.

ఇక తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇలాంటి వేధింపులకే గురైందట. అంతేకాదు ఈ మధ్య కాలంలో జరిగిన శ్రద్ధ వాకర్ ఎంత సంచలమైందో తన మీద కూడా అలాంటి హత్యా ప్రయత్నమే జరిగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు వెంకటేష్ (VENKATESH)హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఆశ (Flora Saini). ఈ హీరోయిన్ అసలు పేరు కూడా ఫ్లోరా సైని. ఇక ఈ హీరోయిన్ బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహనాయుడు సినిమాలో కూడా నటించింది. అలాగే బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈమె కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది.అయితే తాజాగా ఈ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ వల్ల తాను ఎదుర్కొన్న టార్చర్ ని చెప్పుకొచ్చింది.

ఆ హీరోయిన్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో శ్రద్ధ వాకర్ (SHRADDHA WALKER)హత్య ఎలాంటి సంచలనం సృష్టించిందో అప్పట్లో నన్ను కూడా నా బాయ్ ఫ్రెండ్ అలాగే హింసించేవాడు. శ్రద్ధ లాగే సేమ్ నన్ను కూడా నా పేరెంట్స్ నుండి నన్ను దూరం చేసి ఒంటరిగా మార్చాడు. ఇక అతని ప్రేమలో పడి నేను నా కన్న వాళ్లకు దూరమై అతనితో ఉన్నాను. కానీ కొన్ని రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అతని బిహేవియర్ లో చాలా మార్పులు కనిపించాయి. ప్రతిసారి నన్ను తిట్టడం, గొడవ పెట్టుకోవడం, అలాగే తీవ్రంగా కొట్టడం,పిచ్చి పట్టిన వాడిలా బిహేవియర్ చేయడం చేసేవారు.కానీ అతడు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం అవ్వలేదు.

ఇక ఓ రోజయితే ఏకంగా తను కొట్టిన దెబ్బలకు నా దవడ కూడా విరిగింది. ఇక ఆరోజు అతను కొట్టిన దెబ్బలకు నేను చనిపోతానేమో అనుకున్నాను.ఇక ఆ భయంతో నా ఒంటిమీద బట్టలు ఉన్నాయో లేవో కూడా చూసుకోకుండా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మరుసటిరోజే అతనిపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. కానీ పోలీసులు నేను చెప్పింది ఏ మాత్రం నమ్మలేదు. ఆ తర్వాత నేను రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల అతనిపై కేసు ఫైల్ చేశారు అంటూ  హీరోయిన్ ఫ్లోరా సైని (FLORA SAINI)చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *