సిల్క్ స్మిత(Silk Smitha) ని రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ప్రేమతో గౌరవిస్తే.. కేవలం రాధాకృష్ణ అనే వ్యక్తి మాత్రం పీడించేవాడట. ఇంతకీ ఈ రాధాకృష్ణ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రాధాకృష్ణ ఎవరో కాదు సిల్క్ స్మిత దగ్గర చేరిన ఒక డాక్టర్. ఈయన అప్పట్లో సిల్క్ స్మిత దగ్గరుండి అన్ని బాగోగులు చూసేవారట. అయితే అప్పట్లో ఇతడు సిల్క్ స్మిత నయానా భయానా బెదిరించి లోబర్చుకున్నాడని, అతని బందీ ఖానాలో నుండి సిల్క్ స్మిత తప్పించుకోలేకపోయిందని, అంతగా ఇతడు సిల్క్ స్మిత జీవితాన్ని బందీ చేశాడని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.

సిల్క్ స్మిత (Silk Smitha) అప్పట్లో చాలామందికి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. దీంతో అప్పట్లో ఈ హీరోయిన్ లేని తమిళ , తెలుగు సినిమాలు ఒక్కటి కూడా ఉండకపోయేవి. దీంతో ఇండస్ట్రీలోనే సిల్క్ స్మిత బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. బిజీ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా డబ్బులు ఈమెకు ఇచ్చేవారు. ఇక ఆ డబ్బంతా మైంటైన్ చేయలేక సిల్క్ స్మిత రాధాకృష్ణ అనే వ్యక్తిని పెట్టుకుంది. కానీ ఇతను మాత్రం సిల్క్ స్మిత ను సర్వనాశనం చేసి ఆస్తులు మొత్తం కాజేశాడు అన్నది అప్పట్లో ఇండస్ట్రీలో మారుమోగిన మాట. సిల్క్ స్మిత బయట చాలా మంచి మానవత్వం ఉన్న వ్యక్తి అని చాలామంది అంటుండేవారు. అంతేకాదు సిల్క్ స్మిత ఇంటికి చాలామంది ఆర్టిస్టులు సహాయం కోసం వచ్చేవారట.

వారికి తన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి పంపించేదట. సిల్క్ స్మిత తన సంపాదనతో చెన్నై లో ఎన్నో ఆస్తులు అలాగే తన సొంత ఊరు కొవ్వూరులో కూడా చాలానే ఆస్తులు సంపాదించుకుంది. వాటిలో కొన్ని తమ బంధువులకు కూడా ఇచ్చిందని సమాచారం. కానీ ఆపై సంపాదన అంతా ఈ రాధాకృష్ణ మంట కలిపేసారని అంటుంటారు. రాధాకృష్ణ సిల్క్ స్మితకు వచ్చిన చాలా అవకాశాలను మిస్ చేశాడు. ఆమెకు హెల్త్ బాగాలేదని దొంగ మాటలు చెప్పి ఆమె దగ్గరికి వచ్చిన సినిమా వాళ్ళందరినీ పంపించేవాడు.

తీరా ఆమె తన సొంత కారులో షూటింగ్ స్పాట్ కి వెళ్తే అక్కడ షూటింగ్ మరొకరితో జరిగేది. ఇదేంటి అని సిల్క్ స్మిత అడగ్గా.. మీ రాధాకృష్ణ (RADHA KRISHNA) నే మీకు హెల్త్ బాగాలేదని చెప్పారు. అందుకే మేము వేరే ఆర్టిస్ట్ ని పెట్టుకున్నామని చెప్పేవారు. ఇక బాధతో ఇంటికి వచ్చి సిల్క్ స్మిత మందు కొట్టి అతనితో గొడవ పడేది. ఇక ఆ గొడవలో సిల్క్ స్మిత ని రాధాకృష్ణ రక్తం వచ్చేలా కొట్టేవాడు. ఇలా ఇంటా బయట ఎన్నో సమస్యలు ఎదుర్కొని పెట్టిన పెట్టుబడులు రాక తన నిజ జీవితంలో ఎన్నో బాధలు భరించి చివరికి సూసైడ్ చేసుకొని మరణించింది సిల్క్ స్మిత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *