Yashoda Ott Release date Amazon Prime
Yashoda Ott Release date Amazon Prime

సమంత (Samantha) ప్రధాన పాత్ర లో నటించిన యశోద (Yashoda) సినిమా ఓటీటీ (OTT) విడుదల సిద్ధమైంది. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ఈ సినిమా కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సమంత నటనను అందరు పొగిడారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ను థియేటర్ లో చుడనివారు ఎప్పుడెప్పుడు ఓటీటీ లో వస్తుందా అని ఎదురుచూశారు.

ఇక ఈ యశోద (Yashoda) సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ ను ఎదుర్కున్న నేపథ్యంలో కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా ఓ ప్రెస్ మీట్ ద్వారా దానికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమా ను డిసెంబర్ 9 న విడుదల కాబోతుంది.

దిగ్గజ ఓటీటీ సంస్థ యశోద అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో ఈ సినిమా ను విడుదల చేయబోతున్నారు. మరి థియేటర్ లో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

ఈ సినిమా లో మలయాళ హీరో ఉన్ని ముకుంద నటిస్తుండగా సమంత ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ ఈ సినిమా కి మంచి బజ్ ఏర్పడింది. ఇకపోతే ఇప్పుడిప్పుడే సమంత (Samantha) తన అనారోగ్యం నుంచి కోలుకుంటుండగా త్వరలోనే ఆమె చేయబోయే సినిమాలను త్వరలోనే మొదలుపెడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *