అవును..మీరు వినేది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే అప్పట్లో హిట్ పెయిర్ గా ఉన్న త్రిష ప్రభాస్ ఇద్దరూ మళ్లీ కలిసి నటించబోతున్నారట. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ త్రిష కలిసి వర్షం(varsham), పౌర్ణమి, బుజ్జిగాడు వంటి సినిమాల్లో నటించారు. ఇక ఈ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ ఎలా ఉండేదో మనకు తెలిసిందే. అంతేకాదు వీరు వరసగా మూడు సినిమాల్లో నటించడం వల్ల చాలామంది వీరి మధ్య ఏదో ఉందని భావించారు.

ఇక ఆ వార్తలకు తగ్గట్టే వీళ్ళిద్దరి విషయాలు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయ్యాయి. దాంతో వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారు త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ కూడా చెబుతారు అంటూ ఎన్నో వార్తలు వీరిపై వచ్చాయి. కానీ అదే టైం కి త్రిష రానా తో క్లోజ్ గా ఉండడం ఆయనతో ఎఫైర్ వల్ల ప్రభాస్(prabhas) కాస్త త్రిషకు దూరంగా ఉంటూ వచ్చారట. ఇక అప్పటినుండి ప్రభాస్ త్రిష పెళ్లి మ్యాటర్ అక్కడితో ఆగిపోయింది. కానీ అప్పట్లో ఆయన అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బాగుండు అంటూ బాధపడ్డారు. ఇక చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ తో మళ్ళీ త్రిష స్క్రీన్ షేర్ చేసుకోబోతుందంటూ ఇండస్ట్రీలో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

ప్రభాస్ డైరెక్టర్ మారుతి(maruthi) కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక అతి త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నారు అంటూ ఇప్పటికే ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. ఇక తాజాగా ఈ సినిమాలో త్రిష కూడా నటించబోతుంది అంటూ ఒక వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తోంది. అయితే త్రిష హీరోయిన్ గా కాకుండా ఒక గెస్ట్ పాత్రలో రాబోతుంది అని సమాచారం.

అయితే త్రిష(trisha) ఈ సినిమాలో కేవలం ఐదు నిమిషాలే కనిపిస్తుందట. కానీ ఈ సినిమాలో ఈమెదే మెయిన్ క్యారెక్టర్ అంటూ ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పాత ప్రేమకులు కలవబోతున్నారా. అయితే వీరు మళ్ళీ తమ పాత ప్రేమను గుర్తుకు తెచ్చుకొని ఒకరినొకరు ప్రేమించుకుని ఇప్పటికైనా పెళ్లి పీటలు ఎక్కితే బాగుండు అంటూ వారి అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ విషయంలో క్లారిటీ ఏంటో తెలియాలంటే మూవీ యూనిట్ స్పందించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *