Chiru Father Venkata Rao Acted:మామగారితోనే కాదు తండ్రి తోనూ సిల్వర్  స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మెగాస్టార్.. ఆ సినిమా ఏమిటో తెలుసా..! | Megastar  chiranjeevis father ...టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకొచ్చేన అతి కొద్దిమంది నటులలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్టు లేకుండా వచ్చిన ఈయన ఎన్నో కష్టాలను, అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొని.. మరింతగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో ఆ సినిమాలే ఆయనను మెగాస్టార్ గా నిలబెట్టాయి. ఇటీవల రాజకీయాలలోకి కూడా వెళ్లిన ఆయన ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలలో విజయం సాధించలేక.. తిరిగి ఖైదీ నెంబర్ 150 అనే రీమేక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత అన్నీ కూడా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాకు సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రాబోతున్నాడు . ఏనాడు వివాదాలకు చోటు ఇవ్వని చిరంజీవి ఒకసారి ఒక వ్యక్తి చేతిలో రోడ్డుపైనే దెబ్బలు తిన్నారట. అది ఎవరు.. ఎందుకో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

ఆయన ఎవరో కాదు.. చిరంజీవి తండ్రి.. చిన్న తప్పు కూడా చేయని చిరంజీవి.. తండ్రి చేతిలో దెబ్బలు తినడానికి కారణం ఏంటంటే.. తనకు ఇష్టమైన స్టార్ హీరో సినిమా థియేటర్లలో వస్తోందంటే.. ఎవరికి చెప్పకుండా తమ్ముడు నాగబాబును తీసుకెళ్లి థియేటర్లో సినిమా చూశారట. అయితే ఆ సినిమాకి చిరంజీవి తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని గమనించని చిరంజీవి సినిమా అయిపోయే వరకు తమ్ముడితో కలిసి అర్ధరాత్రి సినిమా చూడడం జరిగింది. అయితే సినిమా అయిపోయిన తర్వాత హాలు బయటికి వచ్చే సమయంలో చిరంజీవితో పాటు నాగబాబుని కూడా చూసిన వారి తల్లిదండ్రులు కోపోద్రిక్తుయ్యారట.

అర్ధరాత్రి సమయంలో చిన్న పిల్లాడిని.. తమ్ముడిని వెంటబెట్టుకొని సినిమాకు వెళ్లడం ఇదేం అలవాటు అని రోడ్డుపైనే.. తన బెల్టు తీసి చిరంజీవిని చితకబాదారట ఆయన తండ్రి.. ఆ తర్వాత తన తమ్ముడిని ఎప్పుడు బయటకు తీసుకెళ్లలేదట. అయితే తన తండ్రి ఆరోజు నేర్పిన క్రమశిక్షణ ఈరోజు తన పిల్లలకు కూడా నేర్పానని చెబుతూ ఉంటారు చిరంజీవి. ఈ విషయాలను ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *