Vijay Deverakonda
Vijay Deverakonda

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరో గా నటించిన లైగర్ సినిమా ఆగస్టు లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నెలరోజులకు ఓటీటీ (OTT) లో విడుదల అయిన ఈ సినిమా కు అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈనేపథ్యంలో ఈ సినిమా యొక్క శాటిలైట్ రిలీజ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఎదురుచూశారు.

పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో అనన్య పాండే (Ananya Pandey) హీరోయిన్ గా నటించగా ఈ సినిమా లో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ (Mike Tyson) కూడా నటించాడు. అందుకే ఈ సినిమా పై అంతటి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఇవి సినిమా హిట్ అవడంలో ఏమాత్రం ఉపయోగపడలేదు.

రిలీజ్ అయిన రోజునుంచే ఈ సినిమా కి బ్యాడ్ టాక్ రావడం జరిగింది. కానీ ప్రొమోషన్స్ బాగా చేయడం తో ఈ సినిమా పై హైప్ భారీగా క్రియేట్ అయ్యింది. అలా ఎన్నో అంచనాల మీద రిలీజ్ అయిన ఈ సినిమా చతికిలపడిపోయింది. రెండో రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్స్ పడిపోయాయి.

ఇప్పుడిప్పుడే ఈ సినిమా డిప్రెషన్ నుంచి బయటపడుతున్న విజయ్ (Vijay Deverakonda) అభిమానులు ఆయన తదుపరి సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె ఈ ఆదివారం అంటే డిసెంబర్ 11 వ తేదీన ఈ సినిమా స్టార్ మా టీవీ (Star Maa) లో ప్రసారం కాబోతుంది. దీన్ని ఛానల్ వారు అధికారికంగా ప్రకటించింది. మరి బుల్లితెరపై ఈ సినిమా ఎలాంటి రేటింగ్స్ (TRP Rating) ను అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *