జమున , జయలలిత ఇద్దరూ కూడా స్టార్ హీరోయిన్స్.. ఒకప్పుడు ఇద్దరూ కూడా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగారు.. ముఖ్యంగా తెలుగులో జమున స్టార్ హీరోయిన్ గా కొనసాగితే .. తమిళంలో జయలలిత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అన్ని భాషల్లో మంచి సక్సెస్ఫుల్ సినిమాలలో నటించినా కూడా.. ఎవరు పుట్టిన చోట వారు మరింత ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య చాలా గమ్మత్తయిన గొడవలు కూడా ఉండేవట. అంతేకాదు ముందుగా వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కూడా చాలా హాస్యాస్పదమైన కారణాలు ఉన్నాయని సమాచారం.

నిజానికి వీరిద్దరూ కలిసి చాలా తక్కువ సినిమాలలో నటించారు. కానీ గొడవ మాత్రం చాలా గట్టిగా చేసుకున్నారు. ఈ ఇద్దరిలో జమున.. జయలలిత కన్నా సీనియర్ కావడం గమనార్హం. జయలలిత చాలా తక్కువగా మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా షూటింగ్లో సీన్ ఉంటే చేసి వస్తుంది.. లేకపోతే ఒక పక్కన కూర్చొని ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ ఉంటుంది. ముఖ్యంగా అప్పట్లో హీరోయిన్స్ కానీ హీరోలు కానీ బాగా చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. అలాంటి టైం లో జయలలిత బాగా చదువుకోవడంతో ఆమెను చూసి తోటి హీరోయిన్లు కూడా అసూయపడేవారు.

పైగా ఆమె ఏ ఒక్కరితో కూడా మాట్లాడకపోవడంతో నిజంగా ఆమె పెద్ద ఇగోయిస్ట్ అని అనుకునే వారు కూడా.. ఈ క్రమంలోనే ఒకరోజు జమున వచ్చినా జయలలిత లేచి విష్ చేయలేదు. జమున సైతం ఏం తక్కువ తినలేదు.. ఆమె కూడా కాస్త గర్వంతోనే ఉండేది.. అంతేకాదు తనకున్న కోపాన్ని ఆమె తట్టుకోలేక నేరుగా జయలలిత దగ్గరకు వెళ్లి ఒక సీనియర్ వస్తే లేచి విష్ చేయవా అంటూ అడిగేసిందట. అప్పుడు జయలలిత మాకు అలాంటి ఫార్మాలిటీస్ పెద్దగా లేవని చెప్పేసరికి ఇంకా కోపంతో ఊగిపోయింది జమున.

అంతేకాదు ఏదో ఒక సీన్లో జయలలిత గట్టిగా ఏడుస్తూ నటించిందట. అయితే జమున ఇది చూసి ఊరుకోకుండా.. అంత గట్టిగా ఏడిస్తే నా డైలాగ్ ఏమైపోవాలి అని అడిగిందట. కానీ అప్పుడు కూడా జయలలిత ఏమాత్రం తగ్గకుండా ..”నా ఏడుపు నేను ఏడుస్తా.. నీ ఏడుపు నువ్వు ఏడువు..” అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. దీంతో కోపంతో ఊగిపోయిన జమున షూటింగ్ నుంచి వెళ్ళిపోతుండగా.. నిర్మాణ సంస్థ వారు ఇలాగే చేస్తే ఇంకో హీరోయిన్ ను తీసుకుంటామని చెప్పడంతో ఆమె వెనక్కి తగ్గిందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *