హ్యాపీడేస్(HAPPYDAYS) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మిల్కీ బ్యూటీ తమన్నా. మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేయించుకొని ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. అంతేకాదు ఈమెను చూసిన స్టార్ హీరోలు అందరూ అప్పటివరకు ఓ మాదిరి కలర్ ఉన్న హీరోయిన్లతో చేసి విసిగిపోయి పాలమీగడ లాంటి ఈమె అందానికి ఒక్కసారిగా ఫిదా అయిపోయారు.దీంతో స్టార్ హీరోలందరూ ఒక్కసారైనా తమన్నతో నటించాలని భావించి వరుసగా తమ సినిమాల్లో హీరోయిన్గా తమన్నాను తీసుకున్నారు. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా తమన్నా సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇక ఈ మధ్యకాలంలో తెలుగులో తమన్న కి కాస్త అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె బాలీవుడ్ వైపు తను అడుగులు వేసింది. ఇక ఇటీవల వచ్చిన బబ్లీ బౌన్సర్ సినిమా తమన్నకు అనుకున్నంత సక్సెస్ తీసుకురాలేదు .తమన్నా కేవలం హీరోయిన్ గానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఐటెం గర్ల్ గా కూడా మారిపోయింది. ప్రస్తుతం తమన్న చేతిలో చిరంజీవి(CHIRANJEEVI) హీరోగా రాబోతున్న భోళా శంకర్ అనే సినిమా ఉంది. ఇక తమన్నా సత్యదేవ్ హీరో హీరోయిన్లు గా వచ్చిన గుర్తుందా శీతాకాలం సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. కానీ ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాని డిసెంబర్ 9న చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఓ మీడియా ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. తమన్నా (THAMANNA)మాట్లాడుతూ.. నాకు అసలు శీతాకాలం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువగా వేసవికాలాన్నే ఇష్టపడతాను. కానీ ఈ సినిమాతో శీతాకాలం పై నాకు ప్రేమ ఎక్కువైంది. ఇక గుర్తుందా శీతాకాలం(GURTHUNDA SHEETHAKALAM) సినిమా నా సినీ కెరీర్ లోనే ఒక మంచి గుర్తుగా మిగిలిపోతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాలో హీరోగా సత్య దేవ్ ని పెట్టమని నేనే అడిగాను. ఎందుకంటే నాకు సత్యదేవ్ అంటే చాలా ఇష్టం.

ఈ సినిమాలో పాత్ర వినగానే ఈ పాత్రకు కరెక్ట్ గా సత్యదేవ్ (SATHYADEV)అయితేనే సెట్ అవుతాడని నేను అనుకున్నాను. అందుకే సత్యదేవ్ ని ఈ సినిమాలో తీసుకోమని సలహా ఇచ్చాను. ఇక డైరెక్టర్ కి కూడా నా సలహా నచ్చడంతో సత్యదేవ్ ని ఈ సినిమాలో హీరోగా చేయమని అడిగారు. దానికి సత్యదేవ్ కూడా ఒప్పుకున్నారు.. అంటూ తమన్నా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తమన్నా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈమె మాటలు విన్న నెటిజన్స్ అంతా తమన్నా కి ఆ హీరో అంటే అంత ఇష్టమా? ఈ ఇష్టం ప్రేమేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ కు తమన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *