అలనాటి కథానాయికలలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తన అందం అభినయంతో మహానటిగా పేరు తెచ్చుకుంది సావిత్రి. ఇక ఈమె తన జీవితంలో ఎన్ని కష్టాలను అనుభవించిందో ఇప్పటికే వచ్చిన మహానటి (MAHANATI)సినిమా ద్వారా మనం చూసాం. సంపాదించిన డబ్బు మొత్తాన్ని దానధర్మాల పేరిట చాలామంది పేదలకు ఇచ్చి అలాగే కొంతమంది మోసగాళ్ల వల్ల తన డబ్బు మొత్తం పోగొట్టుకొని చివరికి చాలా దీనస్థితిలో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సావిత్రి ఓ స్టార్ హీరోయిన్ ఇద్దరు ఓ షూటింగ్స్ స్పాట్ లో కొట్టుకునే వరకు వెళ్లారట.

ఇంతకీ వాళ్లు అలా కొట్టుకోవడం వరకు ఎందుకు వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం.సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ గరికపాటి వరలక్ష్మిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఈమె స్టార్ హీరోయిన్ గా ఉన్న టైంలోనే చాలామంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి కూడా వెనకాడ లేదు. అలాగే ఈమె చాలా గయ్యాలి కయ్యానికి కాలదువుతుందని చాలామంది అనేవారు. ఈ హీరోయిన్ ని కి కోపం చాలా ఎక్కువ. జ్యోతి(JYOTHI) అనే సినిమాలో జి.వరలక్ష్మి, సావిత్రి ఇద్దరు నటిస్తున్నారు. ఇక ఒకరోజు వరలక్ష్మి మేకప్ రూమ్ లో షూటింగ్ కోసం రెడీ అవుతుంది.అయితే అప్పటికే సావిత్రి రెడీ అయ్యి షూటింగ్ సెట్ లో తన తండ్రి పక్కన కూర్చుంది.

అయితే కాసేపటికి ఛాయాగ్రహకుడు వచ్చి వెనకనుండి సావిత్రి(SAVITHRI)ని చూసి వరలక్ష్మి అనుకొని ఆమెపై చేయి వేసి పని అయిపోతే రా పోదాం అని ఆమె భుజం మీద చేయి వేశాడట. ఇక ఆయన చేసిన పనికి చిర్రెత్తిపోయిన సావిత్రి కళ్ళు కనబడడం లేదా అని కోపంగా అడిగిందట. దానికి ఛాయాగ్రహకుడు సారీ నేను వరలక్ష్మి అనుకున్నాను క్షమించండి అని చెప్పడంతో సావిత్రి సైలెంట్ అయిపోయారు. కానీ అక్కడే ఉన్న సావిత్రి నాన్న చౌదరి మాత్రం అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చివరికి హీరోయిన్ వరలక్ష్మి ప్రస్తావన కూడా తీసుకువచ్చి ఆమెను కూడా తిట్టాడు.

ఇక ఈ విషయం వరలక్ష్మికి ఎవరో చెప్పడం వల్ల మేకప్ రూమ్ లో ఉన్న వరలక్ష్మి(VARALAKSHMI) కోపంతో చెప్పు పట్టుకుని బయటికి వచ్చి సావిత్రి నాన్నకి చెప్పు చూపిస్తూ ఎవడ్రా నన్ను తిట్టేది అంటూ చెప్పుతో కొట్టడానికి వెళ్ళింది. అయితే అక్కడే ఉన్న స్రావిత్రి తన నాన్న ని తిట్టడం చూసి ఆవేశం ఆపుకోలేక వరలక్ష్మిని తిట్ట సాగింది. ఇక అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం వీరిద్దరి గొడవతో ఒక్కసారిగా వేడెక్కింది. దాంతో వీరిద్దరిని ఆపడానికి అక్కడ ఉన్న వాళ్లంతా ప్రయత్నించారు. కానీ వాళ్లిద్దరూ కొట్టుకునే వరకు వెళ్తే చివరికి అక్కడున్న వాళ్లు వీరి గొడవను ఆపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *