తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మరింత పాపులర్ అయిన్ ఈమె.. తన జీవితంలో ఎంత ఉన్నత స్థానానికి ఎదిగిందో.. చివరి దశలో అంతే దీనస్థితిని కూడా చవిచూచింది. ఇకపోతే ఈరోజు సావిత్రి 51వ పుట్టినరోజు సందర్భంగా ఆమె కెరియర్లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం

దేవదాసు:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా.. సావిత్రి హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ లో వచ్చి భారీ విజయాన్నీ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా తర్వాత ఎన్నో కలర్స్ లో దేవదాసు సినిమాను తెరకెక్కించినప్పటికీ.. ఈ సినిమా సాధించిన విజయం మరియు సినిమా సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమాతో అటు నాగేశ్వరరావుకు, ఇటు సావిత్రికి మంచి పేరు లభించింది.

మాయాబజార్:
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావులతో పాటు సావిత్రి కూడా ఈ సినిమాలో నటించి భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో ఏఎన్ఆర్ అభిమన్యు పాత్రలో నటించగా.. అభిమన్యుని ప్రేమించే శశిరేఖ పాత్రలో నటించి మరింత ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గమనార్హం.

కన్యాశుల్కం:
బాల్య వయసులో వివాహం చేసుకుంటే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను చూపిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

మిస్సమ్మ:
ఎన్టీఆర్ , ఏఎన్నార్, జమున, సావిత్రి కలిసి నటించిన మిస్సమ్మ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇందులో సావిత్రి , జమునల కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

గుండమ్మ కథ:
ఎన్టీఆర్ , ఏఎన్నార్ , ఎస్వీఆర్ , సూర్యకాంతం, జమున, సావిత్రి తదితరుల భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది విజయ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రాలతో పాటు మూగమనసులు, మంచి మనసులు, రక్తసంబంధం, ఆత్మబంధువు, పెళ్లి చేసి చూడు, దొంగ రాముడు, అర్ధాంగి, తోడికోడళ్ళు , అప్పు చేసిన పప్పుకూడు ఇలా ఈ చిత్రాలన్నీ కూడా సావిత్రి కి మంచి పేరు తీసుకొచ్చాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *