తెలుగు సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి (Savitri) ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో తమిళ, తెలుగు , కన్నడ సినీ ఇండస్ట్రీలో జయంతి కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ కూడా ఎంతో మంది స్టార్ హీరోలతో జోడిగా నటించి, అప్పట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే కొందర్ని చూస్తే వారు ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ అనిగిమనిగి ఉంటారు అని అనిపిస్తుంది.. కానీ అలా ఉండే వాళ్ళు మాత్రం చాలా తక్కువమందే మనకు కనిపిస్తూ ఉంటారు . అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలా అరుదు అని చెప్పవచ్చు.. కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయంతి ఈ కోవకు చెందిన వారే అని చెప్పవచ్చు.

ఇందుకు నిదర్శనం ఏమిటంటే వీరు సినీ కెరీర్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో తమిళ షూటింగ్ జరుగుతున్నప్పుడు జయంతి (Jayanthi), మహానటి సావిత్రి ఇద్దరూ కలిసి ఒకే తమిళ్ సినిమాలో కలిసి నటించాల్సి వచ్చింది. అయితే అప్పటికీ జయంతికి తమిళ్ సరిగ్గా మాట్లాడటం రాదు. అప్పటికే స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది సావిత్రి. ఓ తమిళ సినిమా షూటింగ్ లో ఒక పెద్ద డైలాగు జయంతి చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో తమిళంలో ఆ డైలాగు చెప్పడానికి జయంతి చాలా ఇబ్బంది పడిందట.. దీంతో ఆ సినిమా యూనిట్ ఎన్నో షాట్స్ ని కూడా తీయాల్సి వచ్చింది..

కానీ అక్కడే ఉన్న నటి సావిత్రి కి తీవ్రమైన కోపం వచ్చి ఆ సినిమా దర్శక నిర్మాతలకు డైలాగ్ చెప్పడానికి రాని వారిని తీసుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది ఎందుకు పెడతారు అని చివాట్లు పెట్టిందట.. ఇక సావిత్రి ఆ మాట అనడం తో జయంతి మనసు నొచ్చుకొని అక్కడే ఉన్న మేకప్ రూమ్లోకి వెళ్లి బోరున ఏడ్చిన.. ఆ సినిమా నిర్మాతకు నేను ఈ సినిమాలో నటించను..నా వల్ల ఏదైనా నష్టం వాటిల్లితే కనుక దానికి సంబంధించిన డబ్బులు మీకు ఇస్తాను అంటూ ఆ సినిమా నుంచి తప్పుకుంది..

ఇక తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా జయంతి కొనసాగుతున్న సమయంలో ఒక సినిమాలో నటి సావిత్రి ని గెస్ట్ రోల్ గా తీసుకోవడం జరిగింది. ఇక ఆ పాత్ర కోసం సావిత్రి చెన్నై నుంచి బెంగళూరు వెళ్లగా ఆ సినిమా షూటింగ్ లోకి అడుగు పెడుతున్నప్పుడు నటి జయంతి సావిత్రికి కాళ్ళమీద పడి నమస్కారం చేసింది.. అప్పుడు సావిత్రి నువ్వు స్టార్ హీరోయిన్ వి.. ఇలా చేయాల్సిన అవసరం లేదు అని అనగా.. తను ఇంతకు ముందు జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తూ నన్ను మర్చిపోయారు అని అన్నది జయంతి.. ఇక నిజం తెలుసుకున్న సావిత్రి (Savitri) నిన్ను అలా అన్నందుకు నేను చాలా బాధపడ్డాను.. నన్ను క్షమించు.. అని అడగడం.. అప్పుడు జయంతి మీరు అలా అనడం వల్ల నేను పట్టుదలతో స్టార్ హీరోయిన్ అయ్యాను అంటూ తెలిపింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *