న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి(sai pallavi) సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఈ ఏడాది విరాటపర్వం, గార్గి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ సినిమాల తర్వాత సాయి పల్లవి నుంచి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఒక్క అనౌన్స్మెంట్ కూడా రాలేదు.

దీంతో సాయి పల్లవి నటనకు దూరం కాబోతోంద‌ని.. డాక్టర్ గా సెటిల్ కాబోతోందని వార్తలు వచ్చాయి. అంతేకాదు కోయంబత్తూర్ లో సొంతంగా ఒక హాస్పటల్ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలని సాయి పల్లవి నిర్ణయించుకుందని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజాగా సాయి పల్లవికి సంబంధించి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే ఒక గుడ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే ఈ అమ్మడు రీసెంట్ గా ఓ బంపర్ ఆఫర్ అందుకుందట. అది కూడా బాలీవుడ్(bollywood) నుంచి అని తెలుస్తోంది.

మధు మంతెన, నమిత్ మల్హోత్రా, అల్లు అరవింద్ కలిసి భారీ బడ్జెట్తో మూడు భాగాలుగా త్రీడీ రామాయణం తీయబోతున్నట్టు గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్(ranbir kapoor), రావ‌ణుడిగా హృతిక్ రోషన్ న‌టించ‌బోతున్నారు. సుమారు రూ. 750 కోట్ల బ‌డ్జెట్ తో ఈ త్రీడీ రామాయణంను నిర్మించ‌బోతున్నారు. అయితే ఇందులో సీతగా సాయి పల్లవి ఎంపిక అయింద‌ని తాజాగా ఓ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇప్పటికే సాయి పల్లవితో సంప్రదింపులు జ‌ర‌ప‌గా.. సీతాదేవి(sita devi) పాత్ర‌లో ఆమె నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం రానిందని.. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమైతే సాయి పల్లవి సినిమాలు గుడ్ బై చెప్పబోతోంద‌న్న పుకార్లకు పులిస్టాప్ పడినట్టే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *