Rana slams IndiGo for 'worst experience'
Rana slams IndiGo for ‘worst experience’

Rana slams IndiGo for ‘worst experience’ :

మన స్టార్స్ విమాన ప్రయాణాలు తరుచు చేస్తుంటారు అన్న విషయం తెలిసిందే. షూటింగ్ ల కోసం, విహారయాత్రల కోసం వెళుతూ ఉంటారు. అయితే కొన్ని సార్లు వారికి ఈ ప్రయాణాలు ఎన్నో చేదు అనుభవాలను మిగిలిస్తుంటాయి. విమాన సంస్థలు (airplane Services ) సౌకర్యలు సరిగ్గా లేనందున వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.

గతంలో చాలామంది నటీనటులు తమకు జరిగిన ఇబ్బందులను బహిరంగంగా చెప్పారు. అంతకుముందు విమానప్రయాణంలో చాలామంది సెలెబ్రిటీ లు చనిపోయారు కూడా. ఏదేమైనా విమాన ప్రయాణంలో సామాన్యులకు ఎంత భయం అయితే ఉంటుందో సెలెబ్రెటీలకు అంతే భయాందోళనలు ఉంటాయి.

అలా తాజాగా రానా (Rana Daggubati ) కి ఇండిగో (IndiGo) ఎయిర్ లైన్స్ (Indigo Airlines) పై కొన్ని వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు రానా. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్లేందుకు అన్ని సిద్ధం చేసుకున్న రానా ఎయిర్పోర్ట్ లో చాలా సేపు వేచి చూడడమే కాకుండా షెడ్యూల్ ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్ లో వెళ్లేందుకు సిబ్బంది సూచించారు.

అయితే అక్కడిదాకా బాగానే ఉంది. కానీ లగేజీ మాత్రం తాను వెళ్లిన విమానంలో రాలేదట. సిబ్బంది కూడా సరైన వివరణ ఇవ్వకపోవడంతో అయన ఆగ్రహ వ్యక్తం చేశారట. సోషల్ మీడియా (Social Media) లో చెత్త సర్వీస్ అని చెప్పారు. నెటిజన్లు రానాకు మద్దతు పలుకుతున్నారు. మరీ లగేజీ మిస్ అయ్యిందా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

Senior Heroine Radhika About Bharathi Raja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *