రకుల్ ప్రీత్ సింగ్(rakul preet singh).. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రకుల్ ఒకరు. టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌ సరసన ఆడి పాడిన రకుల్.. బాలీవుడ్ పై మోజు పెంచుకుంది. ఈ క్రమంలోనే గ‌త రెండేళ్ల నుంచి తెలుగులో సినిమాలకు దూరంగా ఉంటుంది.

తెలుగులో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్ లో వ‌రుస ప్రాజెక్టులకు సైన్ చేస్తుంది. నార్త్ లోనే పాతుకుపోవడం కోసం ముంబైకి మకాం మార్చింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ అమ్మడు ఓ అతి చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఒక్క ఏడాదే రకుల్ ఏకంగా ఐదు చిత్రాలతో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో మొదటిది `రాన్‌వే 34`. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(amitabh bachchan) కీలక పాత్రను పోషించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది.

ఆ తర్వాత రకుల్ నటించిన `క‌ట్ పుట్లీ` ఓటీటీ వేదిక విడుదలైంది. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సూపర్ హిట్ మూవీ `రాక్షసుడు`కు ఇది రీమేక్‌. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా న‌టించారు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మూవీ అనంతరం రకుల్ నుంచి థ్యాంక్ గాడ్(thank god), డాక్టర్ జి, అటాక్ చిత్రాలు వచ్చాయి.

ఈ మూడు సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. 2022లోనే రకుల్ కు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఐదు డిజాస్టర్స్ పడ్డాయి. దీంతో 2022 లో బిగెస్ట్ ఫ్లాప్‌ హీరోయిన్(biggest flop actress) గా చెత్త రికార్డును రకుల్ త‌న‌ ఖాతాలో వేసుకుంది. దీంతో పాప టైమ్ అస్స‌లు బాలేద‌ని, బాలీవుడ్ లో రకుల్ కెరీర్ ముగిసినట్టే అని సినీ ప్రియులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మరి రాబోయే చిత్రాలతో అయినా రకుల్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. కాగా, ప్ర‌స్తుతం తమిళ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న `ఇండియన్ 2`లో రకుల్ నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాలు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *