పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో `హరిహర వీరమల్లు` ఒకటి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రం పట్టాలెక్కి చాలా కాలం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌త్వరగా ఫినిష్ చేసే పనిలో ప‌వ‌న్ పడ్డాడు. అలాగే మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో `భవదీయుడు భగత్ సింగ్` సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మేనల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కలిసి `వినోదయ సీతం` రీమేక్ చేయ‌బోతున్నాడని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కాకముందే పవన్ కళ్యాణ్ `సాహో` డైరెక్టర్ సుజిత్ తో ఓ మూవీని అనౌన్స్ చేశాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య(dvv danayya) అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు ఓ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను సైతం బ‌య‌ట‌కు వ‌దిలారు. ఈ కాన్సెప్ట్ పోస్టర్ బట్టి చూస్తుంటే.. సుజిత్ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో పవన గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడ‌ని అర్థమవుతోంది.

అలాగే జపాన్-ముంబై నేపథ్యంలో ఈ సినిమా కథ సాగే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకు పవన్ అందుకుంటున్న రెమ్యునరేషన్(remuneration) హాట్ టాపిక్ గా మారింది. సుజిత్‌ సినిమాకు పవన్ ఎంత పారితోషికం పుచ్చుకుంటున్నాడో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. నిర్మాత దానయ్య ఈ చిత్రానికి రూ.170 కోట్ల బడ్జెట్ ను పెట్టబోతున్నాడట. అయితే అందులో రూ.70 కోట్లు పవన్ రెమ్యునరేషన్ అని టాక్ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ కు 70 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేందుకు దానయ్య కమిట్‌ అయ్యారట. ఇక ఇప్పటికే రూ. 25 కోట్లు అడ్వాన్స్ కింద సైతం ప‌వ‌న్ కు పంపించారని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఎటువంటి పాన్ ఇండియా(pan india) ఇమేజ్ లేని పవన్‌ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం అంద‌రినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప‌నుల‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వి.కె.చంద్రన్‌ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరు? మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *