సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత మొదటి జనరేషన్ పూర్తయిందని చెప్పవచ్చు. ఎన్నో అద్భుతాలను తెలుగు తెరకు పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ మరణించడం అందర్నీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత నెల నవంబర్ 15వ తేదీన అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ కన్నుమూసిన కృష్ణ.. అటు ఇండస్ట్రీ , ఇటు కుటుంబ సభ్యులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ పై తెలంగాణ వ్యతిరేఖి అనే మచ్చ కూడా పడింది.

సూపర్ స్టార్ కృష్ణ .. ఎన్టీఆర్ లాంటి వ్యక్తినే అటు సినిమాలలో ఇటు రాజకీయాలలో ఎదిరించి నిలబడ్డాడు. అయితే కృష్ణ పక్కా తెలంగాణ వ్యతిరేఖి అని ఒప్పుకోవాల్సిందే.. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రత్యేకంగా జై ఆంధ్ర ఉద్యమాలకు సపోర్టు చేసి నిరాహార దీక్షలు కూడా చేసినట్టు అప్పట్లో వచ్చిన మీడియా కథనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు పనిచేసి తెలంగాణ వ్యతిరేఖి అని ఆయనే ఒప్పుకున్నారు. మహాకవి శ్రీశ్రీ లాంటి వ్యక్తి తెలంగాణకి వ్యతిరేకంగా.. ఆయన కవితలు , పద్యాలు రాస్తే అతడు నాకు బాగా ఇష్టమైన కవి అనేవాడు ఘట్టమనేని కృష్ణ.

అంతేకాదు శ్రీశ్రీని జై ఆంధ్ర ఉద్యమ విప్లవ ఇలవేల్పు అంటూ కూడా కొనియాడారు. ఇదిలా ఉండగా తెలంగాణ గురించి కాసేపు పక్కన పెడితే.. ఆయన స్టూడియో మాత్రం అన్ని కాలాల్లోనూ బాగానే విరాజిల్లింది.. స్టార్ హీరోయిన్స్ ని కాంట్రాక్టుల పేరుతో బయట హీరోలకు పని చేయకుండా చేయడంలో కూడా ఆయనకు బాగానే విజయం దక్కింది. ఇక ఎన్టీఆర్ పెత్తనాన్ని భరించలేక సొంత సినిమాలు బ్యానర్స్ స్టూడియోస్ కూడా కట్టేశారు కృష్ణ. అలా హాలీవుడ్, బాలీవుడ్ తో టాలీవుడ్ ని లింక్ చేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఈయనే కావడం గమనార్హం. ముఖ్యంగా బ్లడ్ , బ్రీడ్ అనే మాటలు కృష్ణ ఏనాడూ కూడా మాట్లాడలేదు. కొంతమంది చదువును అంగడి వరకు లాగా అమ్ముకుంటే ఆయన దానిని వ్యతిరేకించాడు.

తెలుగు సినిమా ఖ్యాతిని విస్తరించడంలో కృష్ణ పాత్ర ప్రముఖం.. చనిపోయే దాకా కూడా మంచి ఫిజిక్ కలిగి ఉండడం ఆయనకే చెల్లింది. అయితే టాలీవుడ్ ని ఉద్ధరించినా.. ఏనాడూ కూడా టాలీవుడ్ ను నేనే ఉద్ధరించాను అని మాట్లాడలేదు.. మౌనంగా తన పని తాను చేసుకుంటూ ప్రజలలో దేవుడు అయిపోయారు కృష్ణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *